పరకాల నేటిధాత్రి
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా శుక్రవారం పరకాల పట్టణ కేంద్రంలోని బస్సు డిపో కూడలివద్ద ఆయన విగ్రహానికి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా రకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ గర్వించే గొప్పనేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని పరకాల శాసనసభ్యుల రేవూరి ప్రకాశ్ రెడ్డి కొనియాడారు.కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను భావితరాలకు తెలిసే విధంగా పాఠ్యాంశంగా చేర్చాలని,మలిదశ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాతల్లో ఒకరని,ఆ మహనీయుని జీవితం రేపటి తరానికి ఆదర్శమని ఉద్యమకారుడిగా, ప్రజాస్వామికవాదిగా,పీడిత ప్రజల పక్షపాతిగా,నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడిగా కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం రేపటి తరానికి ఆదర్శనీయమని తెలిపారు.ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్ గా,మంత్రిగా వివిధ హోదాల్లో ప్రజలకు సేవ చేయడంతో పాటు నిరంతరం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తపించారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,అధికారులు,కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఘనంగా కొండా లక్ష్మణ బాపూజీ జయంతి
