ప్రభుత్వ ఆసుపత్రికి స్టాఫ్ నర్స్ లే దిక్కు..

సమయపాలన పాటించని వైద్యులు.

విజిటింగ్ పేరుతో డ్యూటీ మధ్యలోనే డుమ్మా..

ఉన్నత వైద్యాధికారుల పర్యవేక్షణ కొరవడి సమయపాలన కరువు.

నర్సంపేట,నేటి ధాత్రి :

గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేస్తూ పల్లె దవాఖానలు ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.కానీ ఆ ఆసుపత్రులలో వైద్యుల సమయపాలన లేక మెరుగైన వైద్యం లోపిస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.అత్యవసర పరిస్థితుల్లో వెళ్లిన రోగులకు ఆసుపత్రిలో స్టాఫ్ నర్ లే దిక్కవుతున్నారు.ఇదే పరిస్థితి దుగ్గొండి మండల కేంద్రంలోని ప్రభుత్వం ఆరోగ్య కేంద్రంలో బుదవారం మధ్యాహ్నం జరిగింది.దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి గ్రామానికి చెందిన కక్కెర్ల రమేష్ తెలుకాటుకు గురయ్యాడు.వెంటనే చికిత్సా నిమిత్తం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మధ్యాహ్నం 2 గంటలకు వెళ్లగా స్థానిక వైద్యాధికారి అందుబాటులో లేరు.వెంటనే స్పందించిన స్టాఫ్ నర్స్ సబిత తాత్కాలిక ట్రీట్ మెంట్ చేశారు.సమాచారం మేరకు నేటిధాత్రి ప్రతినిధి ఆసుపత్రికి వెళ్లగా
వైద్యాధికారి అందుబాటులో లేరు.వెంటనే ఫోన్ ద్వారా వివరణ కోరగా మందపల్లి పల్లె దవాఖానకు విజిటింగ్ కోసం వెళ్లానని తెలిపారు.మందపల్లి పల్లె దవాఖానకు వెళ్లగా మధ్యాహ్నం 2.30 గంటలకే ఆ పల్లె దవాఖానకు తాళంవేసి వెళ్ళిపోయారు.కాగా 3-40 గంటలకు హడావుడిగా చేరుకున్న వైద్యాధికారి రోగిని పరిశీలించి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందంటూ తెలుపుతూ 10 నిమిషాల వ్యవధిలోనే నర్సంపేట సివిల్ ఆసుపత్రి,వరంగల్ ఎంజీఎం ఆసుపత్రులకు రెఫర్ చేశారు.ఈ సందర్భంగా బాధితుడు రమేష్ మాట్లాడుతూ ఆసుపత్రికి వెళ్ళగానే డాక్టర్ అడుబాటులో లేదు అక్కడి స్టాఫ్ నర్సులు వైద్యం అందించారు.చాలా సమయం తర్వాత వచ్చిన డాక్టర్ నన్ను పరిశీలించి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుపుతూ 10 నిమిషాల వ్యవధిలోనే
నర్సంపేట సివిల్ ఆసుపత్రి,వరంగల్ ఎంజీఎం ఆసుపత్రులకు వెళ్ళాలని రెఫర్ చేశారని ,ఉన్నత వైద్యాధికారి అయి ఉంది కనీసం అబ్జర్వేషన్ లో ఉంచుకోకుండా నర్సంపేట సివిల్ ఆసుపత్రి,వరంగల్ ఎంజీఎం ఆసుపత్రులకు వెళ్ళాలని రెఫర్ చేయడం బాడకలిగిందని తెలిపారు.పల్లె దవాఖానలలో,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు
విజిటింగ్స్,మీటింగ్స్ పేరుతో డ్యూటీలను మధ్యలోనే డుమ్మా వెళ్లిపోతున్నారని పలువురు ప్రజలు,రోగులు ఆరోపిస్తున్నారు.పిహెచ్ సి లకు,పల్లె దవాఖానలకు వైద్యాధికారులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని తరిస్థితి నెలకొంటున్నదని పలువురు అవేదన వ్యక్తం చేస్తున్నారు.జిల్లా ,డివిజన్ స్థాయి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లనే వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోగులు,ప్రజలు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా సమయపాలన పాటించని వైద్యాధికారులు,సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!