
Students
పాఠశాలల్లో సౌకర్యాల కొరత
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి: జహీరాబాద్ డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఎస్ఎఫ్ఎ జిల్లా కార్యదర్శి టిఎల్ రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజులు ఆయన పాఠశాలల్లో సర్వే చేశారు. బుధవారం గుర్తించిన సమస్యలను స్థానిక ఆర్డీవో రామ్ రెడ్డికి వినతిపత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు.