పనులవద్ద సౌకర్యాలు కరువు– కూలీలపట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు

—-రోజుకు ముప్పై నుండి నలబై రూపాయలు మాత్రమే
—–శ్రమ దోపిడికి గురౌతున్న కూలీలు
–చట్టాన్ని కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం
—-డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజేందర్

హసన్‌ పర్తి / నేటి ధాత్రి

ఉపాధి హామీ కూలీలైన హక్కుదారులకు పనులవద్ద కనీస సౌకర్యాలైన నీరు, నీడ, ప్రధమ చికిత్స బాక్సు, సకాలంలో అందించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నరని,
మండుటెండల్లో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు పనుల వద్ద టెంట్ (షేడ్స్) ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వ్యవహారిస్తున్నారని డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజేందర్ అన్నారు. హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం జయగిరి గ్రామంలో హై చెరువులో పనిచేస్తున్న కూలీలతో పని వద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
అనంతరం ఆయన మాట్లాడుతూ
కూలీలు ఎండలో పనిచేసిన కేవలం 30 రూపాయల నుండి 40 రూపాయలు మాత్రమే వస్తున్నాయని కూలీలు అవేధన వ్యక్తం చేశారు.
గత సంవత్సరం ఇంకుడు గుంతల పనిచేసిన,నర్సరీ లో పనిచేసిన,చేరువు పూడిక తీతలో పనిచేసిన కూలీలకు నేటికి డబ్బులు రాలేదని కూలీలు వాపోయారు.
కేంద్ర ప్రభుత్వం కూలీలకు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్, ఆధార్ యాప్,బ్యాంకు అనుసంధానం కొత్త కొత్త యాప్ లను తీసుకువచ్చి కూలీల గొంతు నోక్కుతుందన్నారు.యన్ యమ్ యమ్ ఎస్ సిస్టాన్ని పూర్తిగా రద్దు చేయాలన్నారు. పనిచేసిన పదిహేను రోజులలో కూలీ వేతనాలు అందించాలన్నారు. వడదెబ్బ తగలకుండా కూలీలకు పనుల వద్ద షేడ్స్ ఏర్పాటు చేయాలన్నారు. కూలీలకు ఓఆర్ యస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలన్నారు.
సంవత్సరంలో రెండు వందల రోజుల పని దినాలను కల్పించి, రోజుకు ఆరు వందల రూపాయలను అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ జిల్లా కార్యదర్శి చుంచు నరేష్, రాజు, ఉపాధి హామీ కూలీలైన హక్కుదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *