ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. .
తాజా మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:
భానుడు భగభగలతో ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నాడు ఒక వైపు సూర్య ప్రతాపం మరోవైపు ఉక్కపోతుతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఎండలు తీవ్రతరం అవుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు జాగ్రత్తలు డాక్టర్ల సూచనలు సలహాలు పాటించాలని మొగులపల్లి తాజా మాజీ సర్పంచ్ మోటి ధర్మారావు మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వయసు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు డాక్టర్ల సలహాలు సూచనలు పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా సెలవు దినాలు ఉన్నందున విద్యార్థులు చెరువుకుంటల వద్దకు ఈతలకు వెళ్లకుండా తల్లిదండ్రులు వారిని గమనించాలని కోరారు. ఉపాధి పని జరుగుతున్న గ్రామాల్లో ఉపాధి కూలీలకు అందుబాటులో తాగునీరు, టెంట్లు ఏర్పాటు చేసి అస్వస్థతకు గురైతే వారికి చికిత్స కోసం ప్రధమ చికిత్స బాక్సులు అందుబాటులో ఉంచాలని అన్నారు. అలాగే పని చేసే కూలీలను కూడా ఎండ తీవ్రం కాకుండా ముందే పని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.