చలో హైదరాబాద్ మహాధర్నాను విజయవంతం చేయండి…( రేవా)
మహబూబాబాద్/ నేటి ధాత్రి
సోమవారం 17/11నాడు హైదరాబాదులోని ఇందిరాపార్క్ దగ్గర నిర్వహించే రిటైర్డ్ ఎంప్లాయిస్ కు రావాల్సిన బకాయిల నిమిత్తం నిర్వహించే మహాధర్నాను 2024 నుండి రిటైర్డ్ అయిన ఉద్యోగులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ( రేవా) జిల్లా అధ్యక్షు కార్యదర్శులు సంకా బద్రినారాయణ, గుగులోత్ కిషన్నాయక్, సోమా గోవర్ధన్ కోరారు. రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. మాకు రావలసిన పదవి విరమణ చెందిన ఉద్యోగ ఉపాధ్యాయులకు డబ్బలను వెంటనే చెల్లించాలని కోరుతూ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని( ఎస్ జి పి ఏ టి) స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ పెన్షనర్స్ అసోసియేషన్- తెలంగాణ సారధ్యంలో నిర్వహించ పడుతుందని, కాబట్టి పెన్షనర్స్ అందరూ మన హక్కుల సాధన కొరకు ఈ మహా ధర్నాలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. మేము పనిచేస్తున్న కాలంలో ప్రతి నెల దాచుకున్నటువంటి డబ్బుల్ని ప్రధానంగా జిపిఎఫ్, జి ఐ ఎస్, లీవ్ ఏ న్కాష్మెంట్, గ్రాటివిటీ, కమిటేషన్ తదితర బకాయిల సాధన కొరకు మహాధర్నాల పాల్గొని విజయవంతము చేయవలసిందిగా కోరుతున్నామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో చంద్రమౌళి, యోగేశ్వర రావు, విజయ్ కుమార్, వెంకట్ రెడ్డి, నిరంజన్ రెడ్డి,మహేందర్, మురళీధర స్వామి,నాగేందర్, రఘుపతి, ప్రవీణ్, బిక్షం తదితర పెన్షనర్స్ పాల్గొన్ననారు.
