KV Choudhary Elected as AP Chamber Vice President
రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కేవీ చౌదరి నియామకం
ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ సర్వసభ్య సమావేశం
తిరుపతి(నేటిధాత్రి)సెప్టెంబర్ 27:
ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తిరుపతికి చెందిన కె.వి చౌదరి నీ ఎన్నుకున్నట్లు ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ రాష్ట్ర నేతలు ప్రకటించారు. శనివారం విజయవాడలో ఓ ప్రైవేట్ హోటల్లో ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. తిరుపతికి చెందిన కె.వి చౌదరి గతంలో రాయలసీమ జోన్ చైర్మన్ ల గా కొనసాగారు. తాజాగా ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ నియమించడం జరిగింది.ఈ సందర్భంగా కె.వి చౌదరి మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడం పట్ల తనపై మరి ఎంత బాధ్యత పెరిగిందని చెప్పారు. ముఖ్యంగా వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్రంలో ఉండే వ్యాపారుల సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా వారి సమస్యలు పరిష్కరించడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ అనుసంధానంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా జిఎస్టి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే వ్యాపారులకు నివృత్తి చేసి సమస్య లేకుండా చేయడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ పదవి రావడం పట్ల రాష్ట్ర నేతలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు
