ఎంపిటిసి సభ్యులు పేర్ని ఉషా రవి.
రఘునాథపల్లి( జనగామ) నేటి ధాత్రి:- తెలుగు రాష్ట్రాల్లో కురుమ సామాజిక వర్గానికి ప్రధాన వస్త్రముగా వస్తున్న గొంగడికి యునెస్కో గుర్తింపు ఉత్తర్వులు జారీ చేయడంతో గురువారం రఘునాథపల్లి ఎంపీటీసీ సభ్యులు కురుమ యువజన చైతన్య సమితి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పేర్ని ఉషా రవి కురుమ” హర్షం తెలిపారు. గురువారం విలేకరులతో వారు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 47 విశిష్ట చేనేత సంప్రదాయ దుస్తులు ధరించి ఉంటుంది. చలికాలంలో వెచ్చగాను ఎండాకాలంలో చల్లగాను వర్షాకాలంలో మనిషిని తడవకుండా ఉండడం తదితర కారణాలతో గొంగడికి ప్రత్యేక స్థానాన్ని ఇచ్చినట్లు యూనిస్కో ప్రజలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో గొల్ల కురుమలకు ప్రత్యేక గుర్తింపు రావడం అభినందనీయమని అన్నారు.