
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుంజ సూర్య – కుసుమాంజలి
కొత్తగూడ/గంగారం, నేటిధాత్రి :
ఏ ఎల్ టి వ్యవస్థాపక కార్యదర్శి స్వర్గీయ కుంజ రాము వారి 19వ వర్ధంతి వేడుకలు మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం మోకాలపల్లిలో వారి కుమారుడు కుంజ సూర్య – కుసుమాంజలి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడును తేదీ మార్చి 27, 2024 బుధవారం ఉదయం 11,30 ని,, లకు తధానంతరం వర్ధంతి సభ నిర్వహించబడును ఇట్టి కార్యక్రమానికి గౌరవ ముఖ్యఅతిథి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి డాక్టర్ అనసూయ సీతక్క పాల్గొంటారు
కావున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు , గ్రామ కమిటీ అధ్యక్షుడు, బూత్ కమిటీ అధ్యక్షులు, కిసాన్ సెల్ విభాగం, మహిళా నాయకురాలు, విద్యార్థి విభాగం నాయకులు, సోషల్ మీడియా విభాగం, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, ఆదివాసి సంఘాల నాయకులు, తుడుం దెబ్బ నాయకులు, ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకులు, ఇట్టి కార్యక్రమంలో అందరూ పాల్గొని రామన్నకు నివాళులర్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని పిలుపునిస్తూన్నామని గంగారం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు అన్నారు