ఈనెల 17 కుమార్ల సమావేశం విజయవంతం చేయగలరు
భూపాలపల్లి నేటిధాత్రి
ఈనెల 17న హైదరాబాదులో నీ ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి కుమార్ల కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు నడిగూడ జయంతి రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో కుమ్మర్ల ఆత్మగౌరవం, వృత్తిదారుల సమస్యలు, దేవాలయాలలో ఆదినుండి పూజారులుగా కొనసాగుతున్న హక్కుల కోసం, ఇతర పలు అంశాలపై చర్చించడం జరుగుతుందని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండల వెంకటేశం సిలువేరు సుధీర్ భూపాలపల్లి జిల్లా నాయకుడు తెలియజేయడం జరిగింది.
కావున జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కుమ్మరి కులస్తులు , రాజకీయ నాయకులు , సర్పంచులు, జిల్లా నాయకులు, మండల నాయకులు అధిక సంఖ్యలో హాజరై రాష్ట్రకార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు
