
శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుంకుమార్చన పూజలు
కేసముద్రం/ నేటి ధాత్రి
శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం అమీనాపురం కేసముద్రం మున్సిపాలిటీ శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పంచామృతా లతో అభిషేకం, శ్రీ హోమం, కుంకుమార్చన పూజ లు ఆలయ అర్చకులు వినయ్ మిశ్రా, హేమంతా చార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలోమహిళా భక్తులు అధికంగా పాల్గొని విజయవంతం చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు ఓలం మురళి, బచ్చు పరమేశ్వర్, కొయ్య గూరి యాకుబ్ రెడ్డి, అంబటి మహేందర్ రెడ్డి, బాణాల నాగరాజు, శ్రీరామ్ సంతోష్ భక్తులు పాల్గొన్నారు.