ఆర్ట్స్ కళాశాల ఎన్సిసి క్యాడెడ్స్ ని అభినందించిన కేయూ ఉపకులపతి

సుబేదారి

ఇటీవల హైదరాబాదులో జరిగిన ఇంటర్ గ్రూప్ కాంపిటీషన్స్ ఆర్ డి సి క్యాంపులో వరంగల్ ఎన్సిసి గ్రూప్ 12 సంవత్సరాల తర్వాత ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించడం చాలా గొప్ప విషయం. ఈ క్యాంపులో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ డైరెక్టరేట్ కి సంబంధించిన తొమ్మిది గ్రూపుల నుండి క్యాడేట్స్ పోటీలో పాల్గొనడం జరిగింది. ఈ పోటీలలో డ్రిల్లు పిఎం ర్యాలీ కర్తవ్యపత్ గాడ్ ఆఫ్ హానర్ కల్చరల్ బెస్ట్ క్యా డేట్స్ మొదలైన అంశాలలో వారి ప్రతిభ ప్రదర్శించగా ఓవరాల్ గా వరంగల్ గ్రూప్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా క్యాంపు నుండి తిరిగి వచ్చిన కళాశాల ఎన్సిసి క్యాడేట్స్ నీ ఉద్దేశించి వైస్ ఛాన్స్లర్ ఇదే ఉత్సాహాన్ని ఢిల్లీ వరకు కొనసాగించాలని అభినందించారు . వరంగల్ గ్రూపు నుండి వివిధ కళాశాల నుండి 65 మంది ఎస్ డి, జె డి జె డబ్ల్యూ, ఎస్డబ్ల్యూ క్యాడేట్స్ పాల్గొనగా అందులో ఆర్ట్స్ కళాశాల నుండి 19 మంది క్యాడేట్స్ పాల్గొనగా 12 మంది క్యాడేట్స్ పదవ తెలంగాణ బెటాలియన్ వారు కావడం గొప్ప విషయము. ఇంత మంది సెలెక్ట్ కావడం కోసం కృషిచేసిన కళాశాల క్యాడేట్స్ నీ మరియు ఎన్సిసి అధికారి అయినా లెఫ్టినెంట్ డా ఎస్ స్వామి ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వీసి రమేష్ మాట్లాడుతూ అత్యధికంగా గర్ల్ క్యాండిడేట్స్ ఎంపిక కావడంతో ఇది ఎంతో మార్పునకు సూచకంగా భావించాలని, అదేవిధంగా అందరూ ఎన్సిసి క్యాడేట్స్ చదువును ఎన్సిసిని బ్యాలెన్స్ చేయాలని మరియు క్యాడేట్స్ అందరూ ఐపీఎస్ ప్రిపేర్ కావాలని ఆశిస్తూ వాళ్లందర్నీ అభినందించారు. ఐ జి సి లో సెలెక్ట్ అయిన అందరూ క్యాడేట్స్ ఢిల్లీ లో జరిగే ఆర్ డి సి పరేడ్కు సెలెక్ట్ అయ్యేలా హార్డ్ వర్క్ చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బన్న ఐలయ్య గారు మరియు వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి హనుమంతు మరియు ఎన్సిసి అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ ఎస్ స్వామి సీనియర్ అండర్ ఆఫీసర్ ఎం తపస్వి, ఓ వర్షిత, టి అంజన్న, బి ప్రవీణ్, ఎం రాజ్ కుమార్, జి సింధు, ఎం భావన, కె రమ్య, ఎస్ వైష్ణవి, యూ ప్రవళిక మొదలగు వారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!