
సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన
కాంగ్రెస్ పై మండిపడ్డ కేటీఆర్
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ..
అరు దశాబ్దాలుగా జరిగిన జలదోపిడి ఒక ఎత్తు అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కోవర్ట్‌గా మారి తెలంగాణను ఢిల్లీ లో తాకట్టు పెట్టారని.బనకచర్ల గురించి చర్చ అయితే పోను అన్న రేవంత్ రెడ్డి ఎలా మీటింగ్‌కి పోయాడు.
చంద్రబాబు కి తొత్తు రేవంత్ రెడ్డి.అదిత్యనాథ్ సాగునిటి సపహాదారుడుగా పెట్టుకోవడమే పెద్ద తప్పు. అలాంటిది ఎలా పెట్టుకున్నాడని ప్రశ్నించాడు.కాళేశ్వరం, సితారామ ప్రాజెక్టు లకి అనుమతులు ఇవ్వోద్దని అడ్డుకున్నదే చంద్రబాబు నాయుడు.తెలంగాణ హక్కులని కాపాడడానికి కెసిఅర్ ఉన్నాడనీ కేటీఆర్ తెలిపారు.
ఒకపక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయినా మరోపక్క చంద్రబాబు కోవర్టులా పాలన జరుగుతుందని చెప్పాడు.బనకచర్ల పై కాంగ్రెస్ ప్రభుత్వం స్టాండ్ మార్చకపోతే మరొసారి ఉద్యమానికి బిఅర్ఎస్ సిద్దం అవుతుంది తెలిపారు.
నేడు ఆంధ్ర పాలకుల కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు కనుసైగలలో నడుస్తుంది.చిలుక రేవంత్ రెడ్డి అయితే పలుకులు మాత్రం చంద్రబాబువి.
ఇచ్చంపల్లి ప్రాజెక్టు గతంలో ఉన్న ప్రాజెక్టే.
గోదావరి జలాల విషయం లో తెలంగాణ కి ఇంకా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది.
ఎలాంటి అనుమతులు లేకుండానే బనకచర్ల ప్రాజెక్టు కట్టాలని చూస్తున్నారు.సి.యం రేవంత్ కి ఏ బేసన్ లో ఏ ప్రాజెక్టు ఉందన్న విషయం తెలియదు అని మీడియా ముఖంగా తెలియజేశారు.
రేవంత్ రెడ్డి కి తెలిసింది రియల్ ఎస్టేట్ వ్యాపారమే.
కెసిఆర్ రాయలసీమ,ఆంధ్రా కూడా బాగుండాలి మావాట తెలాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించాలని చుస్తున్నాడు అని తెలిపారు..