టెన్త్ విద్యార్థులకు కేటీఅర్ విషెష్..!
– పరీక్షలు రాయడానికి ప్యాడ్, పెన్నుల పంపిణీ
– సిరిసిల్ల నియోజక వర్గంలో నేటి నుంచి పంపిణీ
– గిఫ్ట్ ఏ స్మైల్ పేరిట అందజేత
సిరిసిల్ల(నేటి ధాత్రి):
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ టెన్త్ విద్యార్థులకు చిరుకానుక అందజేస్తున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు రాయడానికి ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేయనున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ పేరిట గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు అందజేస్తున్నారు. మంగళవారం సిరిసిల్ల నియోజక వర్గంలో నీ సిరిసిల్ల పట్టణం, తంగళ్లపల్లి , ఎల్లారెడ్డి పేట, వీర్ణప ల్లి, గంభిరావుపేట, మూస్తాబాద్ లోని ప్రభుత్వ జడ్పీ హెచ్ ఏస్ పాఠశాల లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు అందివ్వనున్నారు.ఇందుకు పార్టీ నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులు పంపిణీ కి తగిన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులు, ఉపాద్యాయులు హర్షం వ్యక్తమవుతోంది. పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలనీ ఎమ్మెల్యే కేటీఆర్ ఆకాంక్షించారు. పరీక్ష రాయబోతున్న పదో తరగతి విద్యార్థులకు కే టీ అర్ శుభా కాంక్షలు తెలిపారు.
టెన్త్ విద్యార్థులకు కేటీఅర్ విషెష్.!
