
# ఎమ్మెల్సీ ఎన్నికల దుగ్గొండి మండల ఇంచార్జీ,ఎన్నారై శానబోయిన రాజ్ కుమార్..
నర్సంపేట,నేటిధాత్రి :
వరంగల్ ,నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా
భాగంగా బుదవారం నర్సంపేటకు వస్తున్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు సదస్సును విజయవంతం చేయాలని దుగ్గొండి మండల ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జీ,ఎన్నారై శానబోయిన రాజ్ కుమార్ పేర్కొన్నారు. మండలంలోని రాజ్యతండ,మధిర, చాపలబండ,మందపల్లి,గిర్నిబావి, పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సంపేట మాజీ శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏనుగుల రాకేష్ రెడ్డి మెదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కేసిఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగ నియామకాలకు కూడ మేమే భర్తీ చేశామని చెప్పుకుoట్టున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు ఉండాలన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన మేరకు ఉద్యోగ క్యాలెండర్ ను తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాట్ల కొమల భద్రయ్య, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సుకినే రాజేశ్వర్ రావు, సీనియర్ నాయకుడు గుండెకారి రంగారావు, గోనె రాజు, చాంద్ పాషా,మాజీ సర్పంచ్ మోడెం విద్యాసాగర్ గౌడ్,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.