# కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు సాయిలి ప్రభాకర్
నర్సంపేట/వరంగల్,నేటిధాత్రి :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు పిరికి చర్య అని వెంటనే సీఎంకు మాజీ మంత్రి కెటిఆర్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు సాయిలి ప్రభాకర్ డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
ముఖ్యమంత్రి రేవంత్ తన స్వశక్తితో అంచెలంచెలుగా ఎదిగి కష్టకాలంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల ప్రజల ప్రజాదరణ పొంది ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఒక శక్తిగా ఎదిగాడని పేర్కొన్నారు.ప్రజల కోసం నిలబడి ఎదిగిన నేత సీఎం రేవంత్ రెడ్డి అని
నీలాగా నీ బాపు బలంతో రాజకీయాల్లోకి రాలేదని కెటిఆర్ ను ఎద్దేవా చేశారు. తక్షణమే ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో రాష్ట్రంలో ఎక్కడ అడుగుపెట్టిన ఇబ్బందులకు గురికావలసిన పరిస్థితి ఏర్పడుతుందని ప్రభాకర్ హెచ్చరించారు.