హిందూ సమాజానికి కేటీఆర్ క్షమాపణ చెప్పి తీరాల్సిందే
బీజేపీ పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్
పరకాల నేటిధాత్రి
అయోధ్య నుండి అక్షింతలు రాలేదని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ బియ్యన్ని ఊరు రా ఇంటింటా పంచి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందని నిన్న కరీంనగర్ లో జరిగిన బిఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశం లో కేటీఆర్ మాట్లాడిన విధానాన్ని పరకాల పట్టణశాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు గాజులు నిరంజన్ ఖండిస్తున్నామని అన్నారు.అనంతరం మాట్లాడుతూ హిందువులు ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీరాముల వారిని కించపరించే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని,అక్షింతలకు,తలంబ్రాలకు తేడా తెలియని కేటీఆర్ మాట్లాడిన వైఖరి హిందూ సమాజాన్ని కించపరచడమేనని,హిందువుల మనోభావాలు దెబ్బతినెలా మాట్లాడిన కేటీఆర్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.