‘‘కేటీఆర్’’ చేసి చూపించిన అభివృద్ధి ఎవరు చేయలేదు.
`’’ఐటీ మంత్రి’’ అంటే దేశంలోనే 10ఏళ్లలో ‘‘కేటీఆర్’’ పేరు తప్ప మరొకరి పేరు వినిపించలేదు.

పదేళ్ల ప్రగతికి ప్రతీక ‘‘కేటిఆర్’’!
`హైదరాబాద్ అభివృద్ధికి బాట ‘‘కేటిఆర్’’.

హైదరాబాద్ వెలుగుల కిరణం ‘‘కేటిఆర్’’.
`’’సిఎం రేవంత్’’ ట్రాప్ లో పడకండి?
`’’సిఎం రేవంత్’’ తిట్ల మీద స్పందించకండి?

`డిఫెన్స్ లో పడాల్సిసిన అవసరం లేదు!
`తెలంగాణా ఉద్యమ కారుడు ‘‘కేటిఆర్’’.
`పదేళ్లు తెలంగాణా కోసం కొట్లాడిన నాయకుడు ‘‘కేటిఆర్’’.
`పదేళ్లలో తెలంగాణాను పరుగులు పెట్టించిన నాయకుడు ‘‘కేటిఆర్’’.
`పదేళ్లలో హైదరాబాద్ ను పదింతలు పెంచిన నాయకుడు ‘‘కేటిఆర్’’.
’’ఐటి’’ ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టిన పాలకుడు ‘‘కేటిఆర్’’.
`హైదరాబాద్ ను సుందర నగరం చేసింది ‘‘కేటిఆర్’’.
`హైదరాబాద్ అభివృద్ధి లో ప్రతి ఆనవాలు ‘‘కేటిఆర్’’.
హైదరాబాద్ లో మంచినీటి గోస తీర్చింది ‘‘కేటిఆర్’’.
`హైదరాబాద్ ను అమెరికా ను తలపించేలా చేసింది ‘‘కేటిఆర్’’.
`పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించింది ‘‘కేటిఆర్’’.
’’సింగిల్ విండో పాలసీ’’ తెచ్చింది ‘‘కేటిఆర్’’.
`అంతర్జాతీయంగా నాగరాలకు తీసి పోనీ విధంగా హైదరాబాద్ అభివృద్ధి చేసింది ‘‘కేటిఆర్’’.
`కరోనా కష్టమొస్తే ప్రజలకు భరోసా ఇచ్చింది ‘‘కేటిఆర్’’.
`ప్రాణాలకు తెగించి ‘‘రెడ్ జోన్’’ లలో తిరిగి సేవలు చేసింది ‘‘కేటిఆర్’’.
`అర్ధరాత్రులు కూడా పసి పిల్లలకు పాలు పంపిన పాలకుడు ‘‘కేటిఆర్’’.
`చెప్పుకోవడానికి లెక్కలేనన్ని సేవలు చేసింది ‘‘కేటిఆర్’’.
`తెలంగాణా కే యూత్ ఐకాన్ ‘‘కేటిఆర్’’.
ఆజ్ఞ మాత్రమే ‘‘కెసిఆర్’’ ది…అభివృద్ధి మొత్తం ‘‘కేటిఆర్’’ ది.
`’’సిఎం రేవంత్’’ చేసే డైవర్శన్ పాలిటిక్స్ లో పడొద్దు.
`’’నమస్తే తెలంగాణా’’ కు ఏంరోగం?
`’’కేటీఆర్’’ చేసిన అభివృద్ధి రాసేశక్తి లేదా?
`’’టి న్యూస్’’ లో ‘‘కేటిఆర్’’ ఆవిష్కరించిన హైదరాబాద్ చూపలేరా?
`’’కేటిఆర్’’ పడిన కష్టం రాయడాని మూడేళ్లు కూడా సరిపోదు.
’’సోషల్ మీడియా వింగ్’’గడ్డి పీకుతుందా?
’’బిఆర్ఎస్’’ సోషల్ వింగ్ ‘‘ఆంద్రోడి’’ చేతిలో పెడితే ఇలాగే ఉంటుంది.
`గతం తెలిసిన వాళ్ళు నడిపితే ‘‘కేటిఆర్’’ చేసిన అభివృద్ధి తెలుస్తుంది.
`కట్టు కథలు రాయాల్సిన అవసరమే లేదు?
`’’కేటిఆర్’’ చేసి చూపించిన అభివృద్ధి చెప్పితే చాలు.
`హైదరాబాద్ లో వరదలొస్తే మోకాలు లోతు నీళ్లలో సేవలు చేసింది ‘‘కేటిఆర్’’
`తెలంగాణా లో కనిపించే అభివృద్ధి ముఖ చిత్రమంతా ‘‘కేటిఆర్’’.
`సిరిసిల్ల ను ‘‘సిరులసిల్ల’’ చేసింది ‘‘కేటిఆర్’’.
`నేతన్నల ఆకలి చావులు ఆపింది ‘‘కేటిఆర్’’.
హైదరాబాద్, నేటిధాత్రి:
పళ్లున్న చెట్టుకే రాళ్లు పడతాయి. సమర్ధ వంతమైన నాయకుడినే టార్టెట్ చేస్తారు. డిఫెన్స్‌లో పడేసేందుకు అనేక ఎత్తుగడలు వేస్తారు. డీ మోరలైజ్ చేయాలని చూస్తారు. తిడుతుంటారు. రాజకీయాలకు దూరం చేసేందుకు రకరకాల విన్యాసాలు చేస్తారు. అలాగే తెలంగాణలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కేటిఆర్‌ను కూడా విమర్శపాలు చేస్తుంటారు. ప్రత్యర్దులు ఆరోపణలు గుప్పిస్తుంటారు. అంత మాత్రాన కేటిఆర్ సమాజంలో తక్కువయ్యే పరిస్దితి వుండదు. ఎందుకంటే ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశంలో కూడా కేటిఆర్ లాంటి క్రేజీ లీడర్ ఎవరూ లేరు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశంలో కూడా కేటిఆర్‌ను గుర్తుపట్టని యువకులు లేదు. అంతటి క్రేజ్ కేటిఆర్ సొంతం. అందుకే కేటిఆర్‌ను కాంగ్రెస్ నాయకులే కాదు, సిఎం. రేవంత్ రెడ్డి కూడా ప్రతి సారి కలవరిస్తూనేవుంటారు. తిట్ల దండం వల్లిస్తుంటారు. అంత మాత్రాన కేటిఆర్ కుంగిపోవాల్సిన అవసరం లేదు. అదికారంలో వున్న పార్టీ నాయకులు ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. అయితే వారి దృష్టిలో కూడా కేటిఆర్ ఎంతటి సమర్ధవంతమై నాయకుడో వారికి తెలుసు. బిఆర్ఎస్లో కేటిఆర్ , హరీష్‌రావులను మాత్రమే ప్రత్యర్దులు ఎందుకు టార్గెట్ చేస్తారంటే ఆ ఇద్దరు నాయకులకంటే మెరుగైన నాయకులు అటు బిజేపిలో, ఇటు కాంగ్రెస్‌లో కూడా లేరు. అందుకే కేటిఆర్‌ను ఎలాగైనా డిఫెన్స్‌లో పడేయాలన్న లక్ష్యంతో ప్రతి సారి ఏదో రకంగా విమర్శిస్తూనే వుంటారు. పైగా కేటిఆర్‌ను తండ్రి చాటు పిల్లగాడు. తండ్రి చాటు నాయకుడు. కేసిఆర్ లేకుండా బిఆర్ఎస్ వుండదు అంటూ లేనిపోని లెక్కలేస్తుంటారు. ఇటీవల కాలంలో బాడీ షేమింగ్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే కేటిఆర్ కంటే మొగోడు తెలంగాణలోనే లేడు. అవును. ఆయనతో పాటు సమానమైన ప్రజా సేవ చేసిన వారు ఎవరూ లేరు. కేసిఆర్ కేవలం ఆలోచనలు మాత్రమే చేస్తారు. వాటిని అనుసరించి, ఆచరించి, తెలంగాణ పదేళ్ల అభివృద్దిలో కీలక పాత్ర కేటిఆర్దే. ఉన్నత విద్యావంతుడు, విజ్ఞాన వంతుడు, ప్రపంచ దేశాలలో జరిగే ప్రగతి తెలిసిన వారు. అభివృద్ది నమూనాలను అధ్యయనం చేసిన నాయకుడు, వాటిని తెలంగాణలో అమలు చేసిన పాలకుడు కేటిఆర్. అలా తెలంగాణను పదేళ్లలో పదితరాలలో జరగాల్సిన అభివృద్దిని పదేళ్లలో చేసి చూపెట్టిన నాయకుడు కేటిఆర్. పదేళ్ల క్రితం హైదరాబాద్ అంటే ఏమిటో ఇప్పుడున్న హైదరాబాద్ ఎలా వుందో మాజీ రిజర్వ్ బాంక్ చైర్మన్ ఇటీవల చెప్పిన ఒక్క మట చాలు. కేటిఆర్ ఎంతటి సమర్ధవంతమైన నాయకుడో, పాలకుడో తెలిసిపోతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఐదేళ్ల తర్వాత హైదరాబాద్ వచ్చిన తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ చెప్పిన మాటలు అందరూ విన్నారు. అదీ విజన్ అంటే ..అదీ విజినరీ లీడర్ కేటిఆర్ అంటే…కేటిఆర్ నిజంగా మొగోడే…నేరుగా అమెరికా నుంచి వచ్చి కుర్చీలో కూర్చోలేదు. పదేళ్లపాటు తెలంగాణ పోరాటం చేశారు. అలుపెరగని ఉద్యమం చేశారు. కేటిఆర్ ఉద్యమ నాయకుడే. పోరాట యోధుడే. తెలంగాణ కోసం జైలుకు వెళ్లిన నాయకుడే. అలాంటి నాయకుడి పాలనలో తెలంగాణ వెల్లివిరిసింది. పదేళ్లలో తెలంగాణ అన్ని రంగాలలో పరుగులు పెట్టడంతో కీలకభూమిక పోషించిన ఏకైక నాయకుడు కేటిఆర్. హైదరాబాద్‌ను పదేళ్లలో పదింతలు పెంచిన నాయకుడు కేటిఆర్. తాను చేసిన అభివృద్దిని చెప్పుకోలేకపోతున్నాడు. ఎందుకంటే కేటిఆర్ మాటల నాయకుడు కాదు. మాటలు చెప్పి పూటలు గడుపుకునే నాయకుడు కాదు. చేతల నాయకుడు. తన రాజకీయాన్ని, పాలనలను చేతల్లో చూపించిన నాయకుడు. కేటిఆర్ చేసిన అభివృద్ది పనులు రాయడానికి ఇంకా మిగిలి వున్న మూడేళ్ల కాలం చాలదు. అన్ని రకాలైన అభివృద్ది పనులు చేశారు. తెలంగాణ రాక ముందు ఐటి రంగం పరిస్దితి ఏమిటి? కేటిఆర్ ఐటి మంత్రి అయిన తర్వాత పరిస్దితి ఏమిటి? అన్నది దేశంలో వున్న ఏ ఐటి ఉద్యోగిని అడిగినా చెబుతారు. ఐటిని పదింతలు పెంచిన పాలకుడు కేటిఆర్. యాభై వేల కోట్లు వున్న ఐటి ఎగుమతులను రెండున్నర లక్షల కోట్లకు పెంచేందుకు కృషి చేసిన పాలకుడు కేటిఆర్. ఐటిని తెలంగాణలో ఆకాశమంత ఎత్తున నిలబెట్టిన నాయకుడు కేటిఆర్. పరిశ్రమల మంత్రిగా ఆయన తెచ్చిన పరిశ్రమలు అనేకం. వాటి ద్వారా తెలంగాణకు లక్షల కోట్ల పెట్టుబడులే కాదు, లక్షలాది మందికి ఉద్యోగ కల్పన జరిగింది. అందుకే హైదరాబాద్ ఇంతగా విస్తరించింది. విస్తరించి హైదరాబాద్‌కు అవసరమైన అనేక మౌలికసదుపాయాలను, సౌకర్యాలను కల్పించిన పాలకుడు కేటిఆర్. హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణకోసం 37 ఫ్లైఓవర్లు నిర్మాణంచేసి, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ముక్కీ మూలిగి నాలుగైదు ఫ్లైఓవర్లు నిర్మాణం చేయడానికి ఏళ్ల తరబడి పనులు చేశారు. వాటినే గొప్పగా చెప్పుకునే ప్రయత్నం ఆనాడు చేశారు. కాని ఏక కాలంలో అతి తక్కువ సమయంలో హైదరాబాద్‌లో 37 ఫ్లైఓవర్లను నిర్మాణం చేసినా ప్రచారం చేసుకోని నాయకుడు కేటిఆర్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రెండేళ్ల కాలంలో చేపట్టిన ఒక్క ఫ్లైఓవర్ లేదు. ఒక్క నిర్మాణం గురించి నిర్ణయం తీసుకున్నది లేదు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో వుండే మంచినీటి గోస అంతా ఇంతా కాదు. వారానికి అరగంట సేపు కూడా నల్లా వచ్చేది కాదు. నగర శివారుకు మంచినీరు అందింది కాదు. కాని తెలంగాణ వ్యాప్తంగా మిషన్‌భగీరధ పేరుతో ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చిన ఘనత కేటిఆర్దే. ఎందుకంటే మిషన్ భగీరద పర్యవేక్షణ మొత్తం చూసుకున్న నాయకుడు కేటిఆర్. హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాలకుకూడా సురక్షితమైనమంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకున్ననాయకుడు కేటిఆర్. కేసిఆర్ పదేళ్ల పాలనలో ఏనాడు హైదరాబాద్‌లో ఏ ఒక్కరికి మంచినీళ్ల ట్యాంకర్కొనుగోలు చేసుకోవాల్సిన అవసరం రాలేదు. మండు వేసవిలోనూ మంచినీటి కొరత ఎక్కడా కనిపించలేదు. అది మున్సిపల్ శాఖ మంత్రిగా కేటిఆర్ క్రెడిట్ అని చెప్పడంలో సందేహం లేదు. కాని బిఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయిన వెంటనే గత వేసవిలో నీళ్ల ట్యాంకర్లు తప్పని పరిస్దితులు వచ్చాయి. ప్రతి ఇంటికి 20వేల లీటర్ల మంచినీటిని ఉచితంగా పాలకుడు కేటిఆర్. ఒక్కరూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చిన ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం. ఇక కరోనా కాలంలో గుండెల మీద చేయి వేసుకొని నేను సాయం చేశాను అని చెప్పగలిగే కాంగ్రెస్ నాయకులు ఒక్కరూ లేరు. కాని ఒకే ఒక్కడు కేటిఆర్ కరోనా కాలంలో ప్రజల్లో వున్నారు. రెడ్ జోన్ బస్తీలు తిరిగారు. ప్రభుత్వం తరుపును ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. అధికారులు హెచ్చరిస్తున్నా ప్రాణాలకు తెగించి రెడ్ జోన్ ప్రాంతాలలో ప్రజల ముందుకు వెళ్లి భరోసా కల్పించారు. అదీ మగతనమంటే.. అదీ మగాడు అంటే అని ఆనాడే నిరూపించుకున్నాడు. కరోనా సమయంలో బిఆర్ఎస్ నాయకులు మాత్రమే ప్రజలకు సేవ చేశారు. కాని కాంగ్రెస్ నాయకులు కలుగులో దాక్కున్నట్లు ఇండ్ల నుంచి బైటకు వచ్చింది లేదు. ప్రజలకు రూపాయి సాయం చేసింది లేదు. పది బియ్యపు గింజలు ఎవరకీ ఇచ్చింది లేదు. ఓ సందర్భంలో మీడియా ప్రశ్నిస్తే అధికారంలో వున్న వారు చేస్తారు. పదేళ్ల నుంచి అధికారంలో లేము. మా దగ్గరేముంది? అని చెప్పిన కాంగ్రెస్ నాయకులు కూడా వున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో కీలకంగా వున్న మంత్రులు, ఎమ్మెల్యేలలో ఒకరో ఇద్దరో తప్ప ఎవరూ జనానికి సాయం చేసిన వారు కాదు. కరోనా సమయంలో బైట తిరిగిన వారు కాదు. కాని ఆనాడు కేటిఆర్, హరీష్‌రావు, అప్పుడు బిఆర్ఎస్లో వున్న ఈటెల రాజేందర్లు ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేశారు. ఇది చరిత్ర. నాయకులు చెప్పుకోవడానికి వున్న చరిత్ర. కేటిఆర్‌కు ఉద్యమ కారుడిగా చరిత్ర వుంది. ప్రజలకు సేవ చేసిన చరిత్ర వుంది. ప్రాణాలకు తెగించి ప్రజలే ప్రాణంగా చూసిన చరిత్ర వుంది. అలాంటి కేటిఆర్‌ను పాలకులు తిట్లే తిట్లు శాపాలెప్పుడుకావు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌లో వరదలు వస్తే కేటిఆర్ ఇంట్లో కూర్చోలేదు. మోకాలు లోతు నీళ్లలో బురద నీళ్లలో తిరుగుతూ ప్రజలకు సేవ చేశారు. ఆఖరుకు మొన్న కూడా వరదల్లో ప్రజల వద్దకు వెళ్లిన నాయకుడు కేటిఆర్. అలాంటి కేటిఆర్‌ను పాలకపక్షం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టలేని అసమర్ధ మీడియా నమస్తే తెలంగాణ. టి న్యూస్‌లలో కేటిఆర్ చేసిన ప్రగతిని చూపించలేరా? అప్పటి అభివృద్దిని ప్రసారాలు చేయలేరా? జాననానికి తెలిసేలా చేయలేరా? బిఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ చేస్తున్నదేమిటి? గడ్డిపీకుతున్నారా? ఎంత సేపు సిఎం. రేవంత్ రెడ్డి తిట్లే తిట్లకు కౌంటర్లు వేస్తే సరిపోతుందా? ఇప్పటికైనా బిఆర్ఎస్ సోషల్ మీడియా మరింత ఆక్టివేట్ కావాలి. పదేళ్ల కాలంలో కేటిఆర్ చేసిన అనేక రకాలైన ప్రగతి పనులపై స్టోరీలు చేయాలి. జనానికి చూపించాలి. కేటిఆర్ మంత్రిగా సాధించిన విజయాలను, ఇప్పటి ఫ్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ స్టోరీలు చేయాలి. ప్రజల ముందుకు తేవాలి.
