
land grabber
రాష్ట్రంలో చోటా గజదొంగ కేటిఆర్ ..!!
#18 నెలల్లో మేము చేసింది ఏంటో తెలంగాణ యావత్ ప్రజానీకానికి తెలుసు…
#చట్టాన్ని నమ్ముకున్నాం కాబట్టే మేము చట్టపరంగా వస్తున్నాం.
#మీరు చేసిన తప్పులకు తప్పకుండా జైలుకు పోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.
#మీ అయ్యా,మీరు కేసుల పేరుతో ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి చూస్తున్నారు.
#మేము ఆ భాష మాట్లాడాలంటే నీకంటే ఎక్కువ వస్తాయి.
#బీజేపీ పార్టీకి బీ టీమ్ బి ఆర్ ఎస్ అని అందరికీ తెలసు..
#దోచుకున్న డబ్బులకు సాక్ష్యాధారాలు ముందు ఉన్నాయి.
#మీ హయాంలో జరిగిన ఫోన్ ట్యాంపరింగ్ కేసులో ఆనాటి అధికారులు జైళ్లలో మగ్గుతున్నారు.
మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ,కే ఆర్ నాగరాజు…
హన్మకొండ, నేటిధాత్రి:
పదేళ్లలో చేసిన పాపాలకు శిక్షలు అమలు చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న జైళ్లు సరిపోవని,స్థాయిని మరచి మాట్లాడితే ఊరుకునేది లేదని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి,వర్ధన్నపేట శాసన సభ్యులు శ్రీ కే ఆర్ నాగరాజు హెచ్చరించారు.శనివారం రోజున హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు..
చట్టాన్ని నమ్మి వచ్చిన వారిమి కాబట్టే మీ పాపాలకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వేచి చూస్తామని అన్నారు.
పదేళ్లలో ప్రశ్నించడమే పాపంగా 54 కేసులు పెట్టినారు.
మీ తప్పులకు జైలుకు పోయే రోజులు దగ్గర పడుతున్న క్రమంలో ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నావ్.
మీరు చేసిన పాపాలకు,దౌర్జన్యాలకు,దోచుకున్న డబ్బులకు పూర్తి ఆధారాలు ఉన్నాయని త్వరలో ముందుకు వస్తాయి…
కెసిఆర్ హయాంలో పెద్ద పెద్ద రిపోర్టులను సైతం అవహేళన్ చేసిన దాఖలాలు సమాజంలో ఉన్నాయి.
మీ హయాంలో నిర్మించి కాళేశ్వరంలో పనిచేసిన ఇరిగేషన్ అధికారుల ఇండ్లలో సోదాలు చేస్తే వందల కోట్ల విలువైన ఆస్తులు బయటకు వచ్చాయి.
నిరసన తెలిపే స్వేచ్సుకూడా లేకుండా చేసినవ్..
నీ అయ్యా వరంగల్ మూడు రోజులు ప్రగల్భాలు పలికిన మాటలు ప్రజలకు ఇంకా గుర్తున్నాయి.
ప్రజా ప్రభుత్వంలో ఆరు గ్యారంటీలలో ఉచిత 200 యూనిట్ల విద్యుత్తు లేదా,ఉచిత బస్ లేదా,రైతు రుణమాఫీ లేదా..ఇందిరానగర్ ఇళ్లు లేవా..
అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలను కళ్లుండి చూడలేని కబోదివి నువ్వు కేటిఆర్.
ముఖ్యమంత్రి పై నువ్వు మాట్లాడే భాష నీకంటే మాకు ఎక్కువ వస్తాయి.
మేము భాష మాట్లాడితే బిడ్డా మీరు ఇక్కడ ఉండరు.
ప్రశ్నించే మీడియా వారిని ఇతరులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారు.
మీ అనైతిక నిర్ణయం వలన జిల్లా ముక్కలుగా ఏర్పడటం వలన ఈ రోజు జిల్లాలో ఉన్న మేధావులు జిల్లాలను కలపాలని వార్తల్లో వస్తున్నాయి.
పెద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉచిత విద్యా అందించాలనే సంకల్పంతో హనుమకొండలో ఇంటి గ్రేటెడ్ మోడల్ పాఠశాల ఏర్పాటుకు శ్రీకారం చుడితే ఈ రోజు 33 విద్యార్థి సంఘాలు స్వాగతిస్తుంటే ఒక్క సంఘం వ్యతిరేకిస్తున్నది.
అభివృద్ధి పేరుతో పదేళ్లు మోసం చేసింది బి ఆర్ ఎస్ పార్టీ.
అణగారిని వర్గాల అభివృద్ధి,అభ్యున్నతి కోసం పాటుపడుతున్నది కాంగ్రెస్ అని ఎమ్మెల్యేలు తెలిపారు.