తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో స్థానిక SS. గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన మండల స్థాయి సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని రాష్ట్రంలో దేవాలయాలు ప్రాజెక్టులు వనరులు ప్రతి గ్రామంలో రోడ్ల అభివృద్ధి కానీ పట్టణాల్లో మెడికల్ కాలేజీ గాని ఇంజనీరింగ్ కాలేజీ గాని అగ్రికల్చర్ యూనివర్సిటీ గాని ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని అలాంటిది రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేని బిజెపి సర్కార్ కి మోడీ ప్రభుత్వానికి ఓటు వేస్తారా అలాంటిది రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన గులాబీ కి ఓటేస్తారని ప్రజలు కోరారు రాష్ట్రంలో ఏదైనా సమస్య వస్తే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి పని చేసుకునే దమ్ము సత్తా గులాబీ కండువకే ఉన్నది తప్ప కాంగ్రెస్కు లేదని కాంగ్రెస్ పార్టీ ఆరుగ్యారంటీలు నెరవేరుస్తామని ఒక్కటి కూడా నెరవేర్చలేదని రైతు రుణమాఫీ చేస్తామని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇలాంటి ఎన్నో హామీలు ఇచ్చాయని అలాంటి వారిని ఎదిరించాలంటే ప్రజలు గులాబీ కారు గుర్తుపై ఓటు వేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని మండల విస్కుతస్థాయి సమావేశంలో మండల ప్రజలు పేరుపేరునా కోరుతూ వచ్చే పదవ తారీఖున మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో ఉన్నందున తంగళ్ళపల్లి మండలం నుంచి 15 వేల మందిని తీసుకురావాల్సిందిగా తెలియజేస్తూ వచ్చిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి విసుకుతస్థాయి సమావేశంలో జడ్పీ చైర్మన్ మాజీ జడ్పీ చైర్మన్ జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు ఎంపిటిసిలు సర్పంచులు జిల్లా యూత్ నాయకులు మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సభకు హాజరైనారు