అంగరంగ వైభవంగా.కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు*
రాయికల్ నేటి ధాత్రి. ఏప్రిల్ రాయికల్.పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ “విరించి-2025″వార్షికోత్సవ వేడుకలను గురువారం ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ జూపల్లి వేణుగోపాల్ రావు మాట్లాడుతూ….. పాఠశాలల్లో వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థులలోని ప్రతిభ పాటవాలు వెలికి తీయడానికి దోహదపడతాయని అన్నారు.విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటల్లో రాణించాలన్నారు. విద్యార్థుల చదువు విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా చదువుపై దృష్టి పెట్టి భవిష్యత్తులో ఉన్న శిఖరాలను అధిరోహించాలని,సోషల్ మీడియాలకు బానిసలు కాకుండా తగు జాగ్రత్తతో వ్యవహరించాలని సూచించారు.విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలన్న ఉన్నత స్థాయిలో స్థిరపడాలన్న ఉపాధ్యాయులు చెప్పే పాఠాలతో పాటు తల్లిదండ్రుల పెంపకం చాలా ముఖ్యమని అన్నారు.వార్షికోత్సవ కార్యక్రమంలో విద్యార్థులు పలు సందేశాత్మకమైన సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు,కరాటే,పౌరాణిక దేశభక్తి నృత్యాలతో పలువురిని అబ్బురపరిచారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జూపల్లి వేణుగోపాల్ రావు,డైరెక్టర్ జూపల్లి తిరుపతిరావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.