క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే 102 వర్ధంతి వేడుకలు..
రామాయంపేట మార్చి 10 నేటి ధాత్రి (మెదక్)
క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే 128 వ వర్ధంతి కార్యక్రమాన్ని రామాయంపేట పట్టణంలోని పూలే విగ్రహాల చెంత ఏర్పాటు చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగినది.
ఈ సందర్భంగా ఫౌండర్ అశ్విని శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో అసమానతల మీద ఆలు పెరగని పోరాటం చేసి మహిళా హక్కులను సాధించిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని అన్నారు.
అలాగే ఆడపిల్లల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళా చైతన్య మూర్తి అని, సమాజంలో రుగ్మతలను రూపుమాపడానికి అనేక ప్రయత్నం చేసిన సామాజిక ఉద్యమకారిని సావిత్రిబాయి పూలే అని అన్నారు.
అలాగే మహాత్ములు చూపిన బాటలో యువత నడుస్తూ చెడు మార్గాన్ని వదిలిపెట్టి సన్మార్గంలొ నడుస్తూ మంచి లక్షణాలను అలవాటు చేసుకొని మంచి యువకులుగా ఎదగాలని, సమాజానికి మన వంతుగా ఎంతో కొంత సహాయం చేయాలని, మహనీయుల ఆశయాలను పునికిబుచ్చుకొని మన చుట్టూ ఉన్న ప్రాంతమునకు, ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అబ్రమైన గంగా రాములు , సుంకోజు దామోదర్ , అల్లాడి వెంకట్, శశికాంత్ ,రెడ్డమైన నరేష్ , దేవుని రవి, పిట్ల శ్రీశైలం, పుట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.