
President Shanigarapu Rajender.
బి ఫార్మసీ అకాడమీలో క్రాంతి కుమార్ కు గోల్డ్ మెడల్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన బీఫార్మసీ అకాడమిక్స్ లో గోల్డ్ మెడల్ పొందిన దళిత బిడ్డను అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు శనిగరపు రాజేందర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది
కుమ్మరి స్వరాజ్యం రవిల కుమారుడు కుమ్మరి క్రాంతి కుమార్ కు
హనుమకొండ లోని విద్యానగర్ లో గల సైడ్ పీటర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్స్ కాలేజీలో 27వ గ్రాడ్యుయేట్ బి ఫార్మసీ అకాడమిక్స్ లో గోల్డ్ మెడల్ జిపిఏటి లో ఆల్ ఇండియా ఏ ఐ ఆర్9357 ర్యాంక్ కుమ్మరి క్రాంతి కుమార్ సాధించాడు భారతరత్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి ప్రతి ఒక్కరూ చదువుకోవాలని హక్కులు కల్పించి పేదవారైనా దళితులకు చదివే ఆయుధంగా మలుచుకొని గొప్ప గొప్ప చదువులు చదివి తల్లిదండ్రులకు ఉన్న ఊరుకు మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని రాజ్యాంగంలో హక్కులు కల్పించారు కూలి చేసుకుంటే గాని పూట గడవని స్థితి లో ఉండి తన కుమారుని కష్టపడి చదివించిన తల్లిదండ్రుల కు అంబేద్కర్ యువజన సంఘం కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కట్ల శంకర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ఆరు ముళ్ళ ఎల్ల స్వామి పీట్ల రంజిత్ ఎడ్ల సదానందం రత్నం రామకృష్ణ ఈర్ల సారయ్య ఇనుగాల రాజు గుర్రం భద్రయ్య రామంచ కిరణ్ ఎలుక పెళ్లి రాజు రామంచ మధుకర్ ఎలుక పెళ్లి సుమన్ పాల్గొన్నారు