
కూకట్పల్లి జూన్ 17 నేటి ధాత్రి ఇన్చార్జి
తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ లిమిటెడ్ వారి సౌజన్యంతో కూకట్ పల్లి రామాలయం దగ్గర భారత్ వికాస్ పరిషత్ ట్రస్ట్ వేదిక నందు ఆదివారం సాయంత్రం *శ్రీకృష్ణరాయబారం పద్య నాటకం నిర్వహించారు.ఈ కార్యక్రమ
ము యొక్క నిర్వాహకులు తోట సత్య నారాయణ,శ్యామ్,పట్టేల మురళీధ ర్,కోడిదలశివకుమార్ ము ఖ్యఅతి
థిగా శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ని ఆహ్వానించి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లా డుతూ పద్య నాటకాలు నాటికలు పు రాతన కళలని వీక్షించుతున్న సమయం లో తన చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చా యని, ఇటువంటి నాటకంలు నాటికలు అంటే చాలా ఇష్టమని, ఎల్లప్పుడూ కళాకారులను ప్రోత్స హిస్తానని,అదేవి ధంగా కళాకారులను ప్రజలందరు,కేంద్ర ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా ఆదుకొని ప్రోత్సహించాలని అన్నా రు.అనంతరం కళాకారులను శాలు వాలతో సత్కరించారు.ఈ కార్యక్రమం
లో కూకట్పల్లి జనసేన పార్టీ నాయకు
లు కొల్లా శంకర్,కలిగినిడి ప్రసాద్,వాసు దేవరావు,అడబాల షణ్ముఖ,మోహన్ , రాచకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.