Ambedkar Jayanti Tribute by Manchiryal DCC President
సామాజిక విప్లవ మహోపాధ్యాయుడు అంబేద్కర్…
మంచిర్యాల డిసిసి అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
సామాజిక విప్లవ మహోపాధ్యాయుడు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి అన్నారు. శనివారం రామకృష్ణాపూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, సింగరేణి సిహెచ్పి సమీపంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళలు అర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడారు.కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నింపి అక్షరాన్ని ఆయుధంగా మలిచి జ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు, సమాజంలో నిమ్నజాతి వర్గాలకు రాజ్య అధికారాన్ని చేరువచేసే దిశగా అంబేద్కర్ రచన చేసినట్లు వివరించారు. ఆ మహనీయుడు కృషివల్లే నేడు అణగారిన వర్గాలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నట్లు తెలిపారు. నేటితరం యువత అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం కళ,నాయకులు గాండ్ల సమ్మయ్య, శ్యామ్ గౌడ్, పలిగిరి కనకరాజు, యాకుబ్ అలీ, నక్క శ్రీను, సంఘ రవి,శనిగరపు రామన్న,రామకృష్ణ,ఎల్పుల మల్లేష్,గోళ్ళ మల్లేష్,కనుక్కుట్ల కనకయ్య, రామస్వామి,సరేష్,ఆలేటి వెంకటేష్ మహిళా నాయకురాళ్లు పుష్ప, దీప, శారదా,రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
