బీఆర్ఎస్ లో చేరిన కొత్తూరు (డి) సర్పంచ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ మండలం కొత్తూర్ (డి)లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సర్పంచ్ మాణిక్ ప్రభు, ఐదుగురు వార్డు సభ్యులు మాజీ మంత్రి హరీశ్ రావు సమక్షంలో గురువారం బీఆర్ఎస్ లో చేరారు. హరీశ్ రావు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న రోజులు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావు తదితరులు పాల్గొన్నారు.
