భూపాలపల్లి నేటిధాత్రి
కొడవటంచ గ్రామం రేగొండ మండలం శ్రీ లక్ష్మినృసింహ స్వామి దేవస్థానము, స్వామివారి హుండీలను విప్పి లెక్కించగా నోట్లు రూ. 10,99,235-00 లు గా నాణెములు రూ. 58,776-00 మొత్తం రూ. 11,58,011-00 లు గా ఆదాయం వచ్చినది. 2024 సం.రము జాతర సందర్బంగా జరిగిన బహిరంగ వెలములో కొబ్బరికాయలు, పూజ సామాగ్రి అమ్ముకోను హక్కునకు 4,24,000-00 లు, పూల దండాలు, విడి పూలు అమ్ముకోను హక్కునకు 11000-00 ఆదాయం వచ్చినది.
ఈ కార్యక్రమములో డి. అనిల్ కుమార్, పరిశీలకులు, పరకాల డివిజన్, బిల్ల శ్రీనివాస్, కార్యనిర్వాహణాధికారి, ఫెస్టివల్ కమిటీ చైర్మన్ శ్రీ ముల్కనూరి. బిక్షపతి, శ్రీ టి. బుచ్చమాచార్యులు, ముఖ్య అర్చక, టి. శ్రీనివాసాచార్యులు, అర్చక, కమిటీ సభ్యులు ఎం. శ్రీధర్, శ్రీ ఎం. ఓంకార్, శ్రీ డి. కోటేశ్వర్ రావు, కె. జోగేందర్, శ్రీ ఎస్. సుదర్శన్, ఎల్ తిరుపతి, శ్రీమతి సధిరం లక్ష్మి, ఎస్. సంజీవ రెడ్డి, శ్రీ పేరాల తిరుపతి, శ్రీమతి ఇల్లి కళావతి పోలిస్ సిబ్బంది, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.