
Kota Rajababu
గ్రంధాల సంస్థ చైర్మన్ గా కోట రాజబాబు
మహదేవ పూర్ జూలై19 (నేటి ధాత్రి )
జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందిన కోట రాజబాపు ను నియమిస్తూ రాష్ట్ర గ్రంధాలయ శాఖ శుక్రవారం రోజున ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సెక్రటేరియట్ ఆర్డర్ కాపీని తీసుకొని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు గతం లొ కోట రాజబాబు మహాదేవపూర్ పాత సమితి తాలూకాకు రెండుసార్లు సర్పంచ్ గాను, కాలేశ్వరం దేవస్థానం చైర్మన్ గా పని చేశారు. మండల స్థాయి కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా మన్నలను పొంది కాంగ్రెస్ పార్టీకి నమ్మకమైన వ్యక్తిగా పనిచేస్తూ ప్రస్తుతం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపైన నమ్మకంతో పదవి కట్టబెట్టిన మంత్రికి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎల్లవేళలా పార్టీ అభివృద్ధికి, ఆశయాలకు కృషి చేస్తానని తెలుపుతూ తోటి మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.