శ్రీరామ్ దళ్ జిల్లా అధ్యక్షుడిగా కొరిటాల శ్రీనివాసరావు
నర్సంపేట,నేటిధాత్రి:
శ్రీరామ్ దళ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా కొరిటాల శ్రీనివాసరావు నియామకమయ్యారు.శ్రీరామ్ దళ్ తెలంగాణ సంస్థను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర అధ్యక్షులు నంద్యాల వినయ్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థ అభివృద్ధి, ధార్మిక సేవా కార్యక్రమాల విస్తరణ, యువతలో జాతీయ చైతన్యం పెంపొందించే లక్ష్యంతో వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా కొరిటాల శ్రీనివాసరావును అధికారికంగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు నంద్యాల వినయ్ రెడ్డి మాట్లాడుతూ కొరిటాల శ్రీనివాసరావు నాయకత్వంలో వరంగల్ జిల్లాలో సంస్థ కార్యకలాపాలు మరింత వేగవంతమవుతాయని, హిందూ ధర్మ రక్షణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు మరింత బలపడతాయని విశ్వాసం వ్యక్తం చేసింది.శ్రీరామ్ దళ్ లక్ష్యాలు, సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ జిల్లా స్థాయిలో శక్తివంతమైన బృందాన్ని నిర్మించి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ ఆయనకు రాష్ట్ర నాయకత్వం శుభాకాంక్షలు తెలియజేసింది.నూతనంగా ఎన్నికైన వరంగల్ జిల్లా అధ్యక్షులు కొరిటాల శ్రీనివాసరావు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం తనవంతు కర్తవ్యంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు వినయ్ రెడ్డి,రాష్ట్ర,జిల్లా,స్థానిక శ్రీరామ్ దళ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
