
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
మంగళవారం జరిగిన జిల్లా స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ లో జమ్మికుంట మండల పరిధిలోని కోరపల్లి ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని బండారు హర్షిణి ద్వితీయ స్థానంలో ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అకాడమిక మానిటరింగ్ అధికారి కర్ర అశోక్ రెడ్డి, జమ్మికుంట మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్, కోరపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సమ్మయ్య, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు పొత్తూరి దేవదాసు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు చైతన్య, ప్రకాష్, సురేష్, నరహరి, శ్రీనివాస్, ప్రేమలత, రజిత పాల్గొని హర్షిణిని అభినందించారు.