వరంగల్‌లో ఓ వైద్యుడి వక్రబుద్ది! అతడి బుద్ది ఎప్పుడూ పాడుబుద్దే!!

`పనిచేసిన ప్రతి చోట లైంగిక వేధింపులు అలవాటే!

`అంతటా తన్ని తరిమేసినా ఎప్పటికీ బుద్దిరాదంతే!

`తాజాగా మరోసారి బైట పడిన అతని రాక్షస బుద్ది.

`సారీ చెప్పి అతని సతీమణి తప్పు సరిదిద్ది!!

`పని చేసిన ప్రతి చోట ఇదే రిపీట్‌ అవుతోంది!

`అయినా బుద్ది రాని ప్రబుద్దుడి వైఖరి!

`వైద్యులలో దెయ్యామైన దుర్మార్గుడు.

`ఆడపిల్లల పట్ల అసభ్య ప్రవర్తనకు పరాకాష్ట ఈ దుష్టుడు.

వరంగల్‌ జిల్లా ,నేటిధాత్రి: 

వైద్యుడంటే సమాజంలో ఉన్నతమైన గౌరవమే కాదు, పూజ్య భావం కూడా అందరిలోనూ వుంటుంది. వ్యక్తి ప్రాణాలు కాపాడే అవకాశం, నైపుణ్యం వున్న ఆ వ్యక్తి పట్ల సమాజం మొత్తం కృతజ్ఞతాభావంతో వుంటారు. అయితే అలాంటి వ్యవస్థలో కూడా నీచులు, నికృష్టులు, దరిద్రులు, దుర్మార్గులు, చిత్త కార్తె కుక్కలుంటాయని ఇటీవల అనేక సంఘటనల ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. సమాజమంతా గొప్ప వారిగా పూజిస్తుంటే వారి బుద్దులు పాతాళంలో వుంటున్నాయి. అలాంటి ప్రబుద్దుడు ఒకడు వరంగల్‌ లో వైద్యుడుగా చెలామణీ అవుతున్నాడు. అతని పేరు కూరపాటి రమేశ్‌. మహిళ కనిపిస్తే చాలు. ఆసుపత్రిలో పని చేయడానికి వస్తే చాలు. అది ఎంతటి వారైనా సరే..తన దరికి తెచ్చుకోవాల్సిందే? లొంగదీసుకోవాల్సిందే! ఆ మహిళల జీవితం పాడు చేయాల్సిందే! ఆది నుంచి ఆ వైద్యుడి వెర్రివేషాలన్నీ ఇవే.

అతడి బుద్ది ఎప్పుడూ పాడుబుద్దే!! గతంలోనే రమేశ్‌ అనేక లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నాడు. పని చేసిన ఆసుపత్రుల నుండి తన్ని తగిలేయబడ్డాడు. ఇక ఏ ఆసుపత్రి అతని వైద్యునిగా చేర్చుకోవడానికి ఇష్టపడడం లేదు. చివరికి తానే ఆసుపత్రి పెట్టుకోవాల్సి వచ్చింది. అయినా అతని తీరులో మార్పు రాలేదు. రమేశ్‌ సతీమణి కూడా వైద్యురాలే కావడం గమనార్హం. బాధిత మహిళ చెప్పిన వివరాల ప్రకారం ఇటీవల కూరపాటి ఆసుపత్రిలో పని చేసే మహిళ మీద రమేశ్‌ కన్నేశాడు. నయానా, భయాన చెప్పి చూశాడు. ఆ మహిళ అంగీకరించలేదు. ఇక అప్పటి నుంచి ఆ మహిళను రమేశ్‌ వేధించడం మొదలుపెట్టాడు. ఆమెను దూషించడం మొదలుపెట్టాడు. ఇబ్బందులు పెట్టడం షురీ చేశాడు. అయినా ఆ మహిళ దారికి రావడం లేది నిత్యం అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇక విసిగివేసారి పోయిన ఆ మహిళ పోలీసులకు పిర్యాదు చేసింది. మీడియాకు సమారమందించింది. ఇక పరిస్థితి చేయి దాటిపోయేలా వుందని గ్రహించిన రమేశ్‌ సతీమణి సదరు మహిళలకు క్షమాపణ చెప్పించింది. కథ ఇక్కడితో ముగించాలని చూసింది. నిజానికి ఆ మహిళా వైద్యురాలు పరోక్షంగా తన భర్తనే వెనకేసుకొచ్చినట్లైంది. తన భర్తను కాపాడుకునే ప్రయత్నం చేసింది. తన కాపురం కోసమే ఆలోచించింది. కానీ ఆ మహిళ పట్ల జాలి చూపించినట్లు ఎక్కడా కనిపించలేదు. పైగా అదే ఆసుపత్రిలో పని చేసే శ్రీకాంత్‌ రెడ్డి అనే వ్యక్తి వ్యవహారం మరోలా వుంది. ఆసుపత్రులలో పని చేసే వాళ్లు అన్నింటికీ సిద్దమయ్యే రావాలంటూ ఆ మహిళలకు నీతి వాఖ్యాలు వల్లించినట్లు తెలిసింది. బాధిత మహిళ పోలీసులకు, మీడియా కు సమాచారం అందించినట్లు తెలిసి, మీడియా ను శ్రీకాంత్‌ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఒక మహిళల మీద లైంగిక వేధింపులు జరిగితే అది చిన్న సమస్య మీడియా రావాల్సిన అవసరం లేదంటూ ఆసుపత్రిలోకి రాకుండా డోర్లు మూసేశాడు. మేం,మేం మాట్లాడుకుంటామంటూ పెళ్ళి సంబంధాలను కుదర్చుకుంటున్నంత సులువుగా మీడియా తో శ్రీకాంత్‌ చెబుతూ అడ్డుకున్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో ఇలాంటి ఘోరాలు, నేరాలు ఎన్ని జరిగినా పోలీసులు స్పందించరు. ప్రజా సంఘాలు కదలవు. మహిళా సంఘాల జాడ కనిపించదు. అదే ప్రభుత్వాసుపత్రిలో ఏ చిన్న పొరపాటు జరిగినా వందల సంఖ్యలో మీడియా చేరిపోతుంది. వందలాది మంది పోలీసులు వచ్చి చేరుతారు. ప్రజా సంఘాలన్నీ ధర్నాలు, నిరసనలు చేపడతాయి. కానీ అదే ప్రైవేటు ఆసుపత్రిలో ఎంత పెద్ద ఘోరం జరిగినా, పేషెంట్ల ప్రాణాలు పోయినా పోలీసులు ఆసుపత్రికే సెక్యూరిటీ ఇస్తారు. బాధితుల మీద అవసరమైతే కేసులు సమోదు చేస్తారు. ఆసుపత్రి గేటు వరకు కూడా మీడియాను అనుమతించరు. అందుకే ప్రైవేటు ఆసుపత్రులలో దుర్మార్గాలు ఆగడం లేదు. కొంత మంది వైద్యులు దుశ్చర్యలు ఆపడం లేదు. అందువల్ల వైద్య సమాజానికే మాయని మచ్చగా మారిన వైద్యుడు కూరపాటి రమేశ్‌ ను శిక్షించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!