17వ పోలీస్ బెటాలియన్ లో కొణిజేటి రోశయ్య జయంతి వేడకలు.
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోశయ్య జయంతి సందర్భంగా..17వ పోలీస్ బెటాలియన్ సర్దాపూర్ నందు బెటాలియన్ కమాండెంట్ M.I. సురేష్ కొనిజేటి రోశయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ సదర్భంగా కమాండేంట్ మాట్లాడుతూ రోశయ్య 1933 జూలై 4వ తేదీన గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు.
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన ఆయన 1978 నుండి 2009 వరకు పలుసార్లు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో భాగమయ్యారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘ కాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేసిన రోశయ్య మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు. ఇందులో చివరి ఏడు సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనపాటిగా పేరు పొందినారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009 సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబర్ 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించారు. ఆ తరువాత తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్ర గవర్నరు గా పనిచేశారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ జగదీశ్వరరావు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.