`మంచినీటిని కాలుష్యం చేస్తున్న మిల్లులపై చర్యలు: మంత్రి ‘‘కొండా సురేఖ.’’
`’’కాసుల మత్తులో అధికారుల కపట నిద్ర’’ కథనానికి మంత్రి ‘‘కొండా సురేఖ’’ స్పందన.
`‘‘నేటిధాత్రి’’ దిన పత్రికలో వచ్చిన ‘‘కాసుల మత్తులో అధికారుల కపట నిద్ర’’ అనే వార్తకు రాష్ట్ర అటవీ, పొల్యూషన్ శాఖ మంత్రి ‘‘కొండా సురేఖ’’ స్పందించారు.
`ఈ మేరకు ‘‘నేటిధాత్రి’’ తో మంత్రి మాట్లాడుతూ మంచినీటిలో బాయిల్డ్ మిల్లుల కెమికల్ నీటికి కలపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేటిధాత్రి’’ దిన పత్రికలో వచ్చిన వార్తపై వివరాలు సేకరించమని అధికారులను ఆదేశించారు.
`నగరంలో ఇలాంటి మిల్లులు ఎన్ని వున్నాయి, వారి వివరాలు కూడా అందించమని మంత్రి ‘‘కొండా సురేఖ’’, ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’కు కూడా సూచించారు. తాను ప్రస్తుతం డిల్లీ వెలుతున్నట్లు, వచ్చిన వెంటనే పూర్తి సమాచారం ఆధారాలు అందించమని వాటి ఆధారంగా తగు చర్యలకు ఆదేశిస్తామని ఎడిటర్ ‘‘కట్టరాఘవేంద్రరావు’’కు మంత్రి చెప్పారు.
హైదరాబాద్,నేటిధాత్రి:
వ్యాపారంలో మానవత్వం పూర్తిగా మర్చిపోతున్నారు. మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా? అనే విచక్షణ పూర్తిగా కోల్పోతున్నారు. వ్యాపారంలో అడ్డ దారులు తొక్కడం చాలా మంది చేస్తారు. కానీ ప్రజల జీవితాలతో ఆడుకునే అడ్డ దారులు వెతుక్కుంటున్న వాళ్లు కూడా వుంటున్నారు. ప్రజల ప్రాణాలతో, జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. పైకి చూస్తే మాత్రం అవి బాయిల్డ్ రైస్ మిల్లులు మాత్రమే. ఆ మిల్లులకు అవసరమైన నీటిని వాడుకొని, వదిలేసే సమయంలో మానవత్వం మర్చిపోతున్నారు. ఎవరి ప్రాణాలు ఏమైతే మా కేమిటి అనే ధోరణి అవలంభిస్తున్నారు. హన్మకొండ జిల్లాకు చెందిన రాంపూర్ లో వున్న బాయిల్డ్ రైస్ మిల్లుల యజమానులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. మిల్లు నుంచి వెలువడే వ్యర్థపు నీటిని ఏకంగా మంచి నీటి కాలువలోకి వదిలేస్తున్నారు. హన్మకొండ, వరంగల్ నగరాలకు మంచి నీటిని సరఫరా చేసే కాలువలలో మిల్లు కెమికల్ నీటి వ్యర్థాలు యదేచ్చగా వదిలేస్తున్నారు. రాంపూర్‌లో వున్న మిల్లులన్నీ ఇలాంటి దుర్మార్గాన్ని కొనసాగిస్తున్నాయి. మంచి నీటి కాల్వలోకి మిల్లుల కెమికల్ వాటర్ వదిలి నీటిని కాలుష్య కాసారం చేస్తున్నారు. ఇందుకు అధికారులు తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. మిల్లుల నిర్వాకం నిర్వకానికి సహకరిస్తూ అమ్యామ్యాలకు అలవాటు పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే సహజంగా రైస్ మిల్లుల నుంచి వ్యర్థాలు అంటే గాలిలో కలిసే ఊక మాత్రమే అని అందరూ అనుకుంటారు. కానీ భయంకరమైన కెమికల్ వ్యర్థాలు ..అధికారుల నిర్లక్ష్యం తోడు కావడంతో మిల్లర్లు ఆడిరది ఆట పాడిరది పాట మారిపోయింది. అయినా మురుగునీటిని మంచి నీటిలో కలుపుతున్నామన్న సోయి కొంచెం కూడా లేకపోతోంది. సొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మిల్లర్లు యదేచ్చగా సాగిస్తున్న దుర్మార్గాన్ని వెనకేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి బాయిల్డ్ మిల్లులో వెలువడిన మురుగునీటిని శుద్ధి చేసే యంత్రాంగం వుంటుంది. అందుకు ప్రత్యేకమైన ప్లాంటు ఏర్పాటు జరుగుతుంది. కానీ అది తూతూ మంత్రంగానే వినియోగిస్తున్నారు. ఆ నీటి శుద్ధి ప్లాంట్‌ను వినియోగించడమే కొన్ని సంవత్సరాలుగా మానేశారు. ఆ ప్లాంట్లు ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా వాటిని వినియోగించడమే మానేశారు. దాంతో మిల్లుల నుంచి వెలువడే వ్యర్థాల మూలంగా మంచి నీటి కాలువలు మొత్తం కలుషితమైపోతున్నాయి. మిల్లులు సాగిస్తున్న ఈ దుర్మార్గం మూలంగా ప్రజల ప్రాణాలకు హాని జరుగుతోంది. ఆ వ్యర్థాలు ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతోంది. అధికారులకు పట్టిన అవినీతి రోగం ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది. మిల్లుల మూలంగా ఆ నీరు కొన్ని సంవత్సరాలుగా కాలువలో చేరడం వల్ల కాలువలు కూడా పూర్తిగా ధ్వంసమైపోతున్నాయి. ఎక్కడిక్కడ కాలువలకు చెందిన రిటైనింగ్ వాల్స్ దెబ్బతిన్నాయి. కొన్ని కిలోమీటర్ల పొడవునా మంచి శుద్దమైన మంచి నీరు పారాల్సిన చోట మురుగునీటి మూలంగా అడ్డంకులు ఏర్పడడంతో పాటు, కలుషితమైపోతున్నాయి. కాలుష్య కాసారంగా మారిపోతున్నాయి. మురుగునీటి నుంచి వచ్ఛే వ్యర్థాలు కాలువల మధ్యలో గుట్టలుగా చేరిపోతున్నాయి. దాంతో నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారుతోంది. మొత్తంగా అక్కడ పేరుకుపోయిన కెమికల్ ప్రతి నీటి చుక్క కాలుష్యాన్ని మొసుకుపోతోంది. ఇక ఆ పక్కనే వున్న చెరువులోకి కూడా కొన్ని మిల్లుల నుంచి కెమికల్ నీరు పెద్ద ఎత్తున చేరుతున్నాయి. ప్రభుత్వం ఏటా చెరువులో చేపలు పెంచే లక్ష్యం నిర్వీర్యమౌతోంది. ఏటా చేపల లక్ష్యం కూడా నిర్వీర్యం చేస్తున్నారు. ఈ కెమికల్ వాటర్ చెరువులోకి చేరడం మూలంగా చేప పిల్లలు చనిపోతున్నాయి. ఈ విషయం మత్య్స శాఖ దృష్టికి వచ్చినా ఆ అధికారులు కూడా కళ్లు మూసుకుంటున్నారు. వాటర్ బోర్డు అధికారులు ఆ కాలువల వైపు కన్నెత్తి చూడకపోవడాన్ని ప్రజలు నిరసిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు కదలకపోవడాన్ని ప్రజలు తప్పు పడుతున్నారు. నేటిధాత్రి కథనంలో దానికి సంబంధించిన ఫోటోలు ప్రచురించడం జరిగింది. మిల్లుల కెమికల్ నీరు కాలువలో కలవడమే సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. రాంపూర్ మిల్లులు వదిలిన రసాయన నీరు..మంచి నీటి కాలువలో చేరుతూ వుండడం అనేది ఒక దుర్మార్గమైన చర్య. పాపానికి సంకేతం. పర్యావరణం మీద చిన్న పాటి నిర్లక్ష్యం కూడా వహించకూడని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల జాడెక్కడ? ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే అన్నీ తెలిసినా అధికారులు చోద్యం చూడడం అంటే ఆమ్యామ్యాలకు కక్కుర్తి పడి ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం తప్ప మరేం లేదు. హనుమాన్ ఇండస్ట్రీస్ ,కామదేను ట్రేడర్స్ ,వినాయక ఇండస్ట్రీస్ ,మారుతి ఆగ్రో ఇండస్ట్రీస్ ,శ్రీ ధనలక్ష్మి ఇండస్ట్రీస్ ,శ్రీ లక్ష్మీ ఇండస్ట్రీస్ ,శ్రీ శ్రీనివాస ఇండస్ట్రీస్ ,సూర్య ఇండస్ట్రీస్ ,సూర్య తేజ ఇండస్ట్రీస్‌లు సాగిస్తున్న అరాచకం సొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు తెలుసు. అందువల్ల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కళ్లు మూసుకొని మొద్దు నిద్రపోతున్నారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల ముక్కుపుటాలు అధిరేలా వాసన వస్తున్నా అధికారులు తొంగి చూడొద్దనుకుంటున్నారా? అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కెమికల్ కలిసిన మిల్లుల క్రిటికల్ వాటర్ మంచినీటి కాలువను కలుషితం చేస్తున్నా కనిపించడం లేదా? నిలదీస్తున్నా స్పందన కరువౌతోంది. అవే నీటిని మున్సిపల్ వాటర్ బోర్డు ప్రజలకు పంపిస్తున్నారన్న సంగతి కనిపించడం లేదా?ఆయా శాఖల మధ్య సమన్వయ లోపం అనుకునేలా మిల్లర్లకు వరంగా మారి ప్రజలకు శాపమౌతోంది. కలుషిత నీటిని తాగుతున్నారన్న సోయి కూడా అధికారులకు లేకపోవడం వారి బాధ్యతారిత్యానికి నిదర్శనమనే చెప్పాలి. వరంగల్ ప్రజలకు శాపంగా మారుతున్నా మిల్లులకు సహకరిస్తూ, ఉదాసీనత చూపిస్తున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్. అధికారులను గత కొన్ని సంవత్సరాలుగా మామూళ్లతో మెయింటైన్ చేస్తున్న కిలాడి మిల్లర్ ఎర్రబెల్లి..