
కొమురవెల్లి నేటి ధాత్రి
శ్రీ ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో రేపు జరిగే కళ్యాణానికి ఉత్సవ కమిటీని జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత కొమురవెల్లి దేవస్థానం చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు డైరెక్టర్లుగా కొమ్ము రాజేశ్వరి అంబాల ఉమారాణి గౌడ్ తాళ్లపల్లి రమేష్ గుప్తా అల్లం శీను మరియు ఇతరులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా దేవస్థాన చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రేపు జరిగే మల్లికార్జున స్వామి కళ్యాణం లో భక్తులందరూ పాల్గొనాలని అన్నారు ఈ కార్యక్రమంలో మద్దూర్ జెడ్పిటిసి గిరి కొండల్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం గౌడ్ కొమ్ము నర్సింగరావు దాసరి కళావతి పూర్మా ఆగం రెడ్డి బందెల మైపాల్ రెడ్డి పాల లక్ష్మీనారాయణ మంచాల చిరంజీవులు దాసరి శ్రీకాంత్ అంబాల రాము మరి ఇతరులు పాల్గొన్నారు