Kommuru Raju Suspended from BRS Party for Anti-Party Activities
బీఆర్ఎస్ పార్టీ నుండి కొమ్మురాజు సస్పెండ్.
#పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కార్యకర్తలు.
#సస్పెండ్ చేస్తున్నట్లు ధ్రువీకరించిన గ్రామ పార్టీ అధ్యక్షుడు గండు శ్రీధర్.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ అభ్యర్థి ఓటమికి కారణమైన కొమ్మురాజను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు నందిగామ గ్రామ పార్టీ అధ్యక్షుడు గండు శ్రీధర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ గ్రామ పార్టీ కార్యకర్తలతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ప్రత్యర్థుల విజయం కోసం సొంత పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణానికి ప్రధాన భూమిక పాత్ర పోషించిన కొమ్మురాజును పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ గ్రామ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగిందని . అధిష్టానం నిర్ణయం మేరకే గ్రామ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మేడిపల్లి శంకరయ్య, వార్డు సభ్యులు ఇంగోలి ఉమా విజేందర్, తేజ వత్ రాజు, భూక్య సుజాత మధుకర్, మూడు కల్పన దినేష్, మాజీ ఉపసర్పంచ్ కిస్టోజు బ్రహ్మచారి, నాయకులు మేడిపల్లి వెంకటరాజ్యం, సదయ్య, చెట్టుపల్లి దామోదర్, జంగిలి శంకరయ్య, హింగే లింగమూర్తి, గాజుల పాటి బిక్షపతి, కొల్లూరి శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.
