బిజేపిలో కొమురయ్య కుంపటి?

పొరుగు రాష్ట్రం చత్తీస్‌గఢ్ లో కేసులు?

తెలంగాణలో అగ్గువకు పొందిన ప్రభుత్వ భూములు?

గ్రీన్ ఎనర్జీ పేరిట లేని కంపనీలు?

ఇప్పుడు ఆ భూములలో రియలెస్టేట్ వ్యాపారాలు?

విద్యా సంస్థలు అధిపతిగా పేరు?

ప్రభుత్వాల సఖ్యతలో కొల్లగొట్డిన భూములు?

భూములు కాపాడుకునేందుకు రాజకీయాలు?

పార్లమెంటు టిక్కెట్ కోసం ప్రయత్నాలు!

వ్యతిరేకిస్తున్న కార్యకర్తలు

‌మద్దతిస్తున్న సీనియర్లు.

ఒత్తిడి పెంచుతున్న పెద్ద తలకాయలు.

ఇంతకీ ఆ కొమురయ్య ఎవరు?

అతను పేరు మోసిన కొన్ని విద్యా సంస్థలకు అధిపతి. తప్పు చేయరాదు. అబద్దాలు ఆడ కూడదు. మోసం చేయకూడదు. ఎవరికీ హాని తలపెట్టకూడదు. నిజాయితీగా బతకాలి. కష్టపడి పైకి రావాలి. ఇవి తన విద్యా సంస్థలలో విద్యార్థులకు చెప్పే నీతి పాఠాలు. అయ్యవారు…ఉల్లిపాయ తినొద్దన్నది ఊరి వాళ్లను కాని, నేను తినొద్దని కాదన్నాడట..అలా వుంది మన కొమురయ్య వ్యవహారం. చెప్పేవి సుద్దులు..దూరేవి గుడిసెలు అన్నట్లు.. స్కూల్లో మాత్రమే పిల్లలకు బుద్దులు చెబుతారు. ఆచరణలో మాత్రం అన్నీ వ్యతిరేకంగా చేస్తాడు. ఎవరైనా కష్టపడి పని చేస్తున్నాననే అంటారు. ఆ కష్టం ఎంత కష్టమైందో తెలుసుకుంటే గాని తెలియదు. అందుకే కష్టం విలువ తెలియకుండానే కొమురయ్య పెరగాలనుకున్నాడు. ఎదిగాడు…విద్యా సంస్థల ముసుగులో, ఇతర వ్యాపార సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నాడు. గ్రీన్ ఎనర్జీ తయారీ పేరిట ఉత్తర తెలంగాణ లోని ఓ జిల్లాలో ప్రభుత్వం నుంచి వందల ఎకరాలు తీసుకున్నాడు. చాలా కాలం ఆ భూములను అలా వదిలేసి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు. ప్రభుత్వం నుంచి తీసుకున్నది ఒక పని కోసం, ఇప్పుడు వినియోగిస్తున్నది వ్యాపారం కోసం..అలాగే పొరుగున చత్తీస్‌గఢ్ లో కూడా ఇలాంటి వ్యవహారమే నడిపి కేసులు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు వాటన్నింటినీ తప్పించుకునేందు రాజకీయ అవతారం ఎత్తేందుకు ప్రయత్నం చేస్తున్నాడు..ఎవరా? కొమురయ్య? ఏమిటా రాజకీయం? అన్నది త్వరలో మీ నేటిధాత్రి లో…ఎక్స్ క్లూజివ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!