కొల్చారం మండలం బిఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తెస్తున్న యువ నాయకుడు

తుంకులపల్లి సంతోష్ రావు…

కొల్చారం, (మెదక్) నీటిధాత్రి :-

మెదక్ జిల్లా కొల్చారం మండలం బిఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తెస్తున్న కొల్చారం మండలం బిఆర్ఎస్ పార్టీ యువత విభాగం అధ్యక్షుడు తుంకులపల్లి సంతోష్ రావు. సంతోష్ రావు బిఆర్ఎస్ పార్టీలో చీడపురు అనే వార్తలు గత మూడు రోజుల క్రితం ఒక చానల్లో వచ్చిన విషయాన్ని బి ఆర్ఎస్ పార్టీ యువత నాయకులు తప్పుబట్టారు. సంతోష్ రావు యువతకు ఆదర్శంగా నిలుస్తూ, బిఆర్ఎస్ పార్టీకి పగలు రాత్రి అనక పనిచేస్తూ కొల్చారం మండలానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. దసరా, ఉగాది , సంక్రాంతి పండగలు వచ్చిందంటే యువకులకు వివిధ గ్రామాలలో క్రికెట్ ప్రోగ్రాం, కబడ్డీ, వాలీబాల్ ప్రోగ్రాం ఆట పోటీలు నిర్వహించి తన సొంత డబ్బులతో యువతను ముందుకు నడిపిస్తున్నాడు. ఎవరైనా ఆపదలో ఉంటే వారికి తనకు తోచిన సహాయాన్ని అందిస్తూ కొల్చారం మండలం బిఆర్ఎస్ పార్టీకి మచ్చలేని నాయకుడుగా నిలుస్తున్న యువ నాయకుడు సంతోష్ రావు అని చెప్పుకోవచ్చు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *