
New Traffic Police Koduri Sujatha.
వరంగల్ ట్రాఫిక్ సిఐ గా కోడూరి సుజాత
నేటిధాత్రి, మట్టేవాడ, వరంగల్.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం నాడు సీఐ ల బదిలీలు జరిగాయి. అందులో భాగంగా వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నూతన సిఐ గా కోడూరి సుజాత నియామకమయ్యారు. వరంగల్ షి టీమ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న సుజాత, గురువారం జరిగిన బదిలీలలో భాగంగా వరంగల్ ట్రాఫిక్ సిఐ గా బదిలీ అయ్యారు. గతంలో కాజీపేట ట్రాఫిక్ సిఐ గా పనిచేసిన అనుభవం ఉండటం, నగర ట్రాఫిక్ పట్ల అనుభవం కలిగి ఉండటం కలిసొచ్చే అంశం అని చెప్పొచ్చు. అలాగే షీ టీమ్, బరోసా కేంద్రం ద్వారా మహిళలకు బరోసా కల్పించారు.
శుక్రవారం ట్రాఫిక్ సీఐ గా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. అలాగే వరంగల్ ట్రాఫిక్ సిఐ గా పనిచేస్తున్న కే రామకృష్ణ విఆర్ కు అటాచ్ అయ్యారు.