
Backyard Poultry Training for Women Empowerment
పెరటి కోళ్ల పెంపకం పై అవగాహనా
ముత్తారం :- నేటి ధాత్రి
కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం రామగిరి ఖిల్లా వారు పెద్దపెల్లి లోని వివిధ మండలాలలోని గ్రామాలలో పోషకాహార భద్రత మరియు మహిళల్లో స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి పెరటి కోళ్ల పెంపకం మీద అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు ఇందులో భాగంగా ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామమును కృషి విజ్ఞాన కేంద్రం మూడు సంవత్సరాల పాటు దత్తత తీసుకొని గ్రామం యొక్క సమగ్ర అభివృద్ధికి వివిధ కార్యక్రమాలను చేపడుతుంది. అడవి శ్రీరాంపూర్ గ్రామంలోని రైతులు మరియు మహిళల్లో పోషకాహార భద్రతను పెంపొందించడానికి మరియు మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి పెరటి కోళ్ల పెంపకం మీద శిక్షణ మరియు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా పిడి డిఆర్డిఏ కాళిందిని మాట్లాడుతూ మహిళలకి అందిస్తున్న వివిధ స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాల గురించి వివరించారు అలాగే కృషి విజ్ఞాన కేంద్రం వారు పోషకాహార భద్రత లో భాగంగా షెడ్యూల్డ్ కులాల ఉపరి ప్రణాళిక కింద పెరిటి కోళ్ల పంపిణీ ని సద్వినియోగం చేసుకొని వీటిని గ్రామంలోని మహిళలు ఒక ఎంటర్ప్రైస్ గా తీర్చిదిద్దాలని మండలంలో అడివి శ్రీరాంపూర్ ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కోరారు. డాక్టర్ అమాగంటి శ్రీనివాస్, పుధాన శాస్త్రవేత్త మరియు అధిపతి ,కృషి విజ్ఞాన కేంద్రం, రామగిరి జిల్లా వారు మాట్లాడుతూ కృషి విజ్ఞాన కేంద్రం గ్రామాల్లో చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి రైతులకు వివరించారు. షెడ్యూల్డ్ ఉప ప్రణాళిక కింద కృషి విజ్ఞాన కేంద్రం వారు పంపిణీ చేస్తున్న అసిల్ జాతి మేలైన పెరటి కోళ్ల పెంపకం ను గ్రామంలోని రైతులు చేపడుతూ దీనిని ఒక ఉపాధి మార్గంగా పాటించాలని అలాగే గ్రామంలోని రైతులకి వ్యవసాయ ఆధారిత సమస్యలు ఏవైనా ఉంటే కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలను సంప్రదించి వారి నుండి వ్యవసాయ అభివృద్ధికి సలహాలను తీసుకోవాలని సూచించారు. ఈ అసిల్ జాతి కోళ్ళు సంవత్సరానికి 120 నుండి 140 వరకు గుడ్లను పెడుతుందని అలాగే మూడు నెలల్లో రెండున్నర కేజీల బరువు వస్తుందని దీని మాంసం కూడా మంచి రుచి కలిగి మార్కెట్లో అధిక డిమాండ్ కలిగి ఉంటుందని రైతులకు వివరించారు. ఈ అసిల్ జాతి కోళ్లకు గుడ్లను పొదిగే గుణము ఉండదు. గ్రామంలో మహిళలు ముందుకు వచ్చినట్లయితే వారికి కృషి విజ్ఞాన కేంద్రం తరఫున 100 నుండి 200 గుడ్లు కెపాసిటీ గల చిన్న హేచరీ యూనిట్‌ని కూడా ఇవ్వగలమని తెలియజేశారు కావున రైతులు ఈ అవకాశం ఉపయోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందగలరని కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ ఏ ఎమ్ సి వైస్ చైర్మన్ మద్దెల రాజయ్య కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ భాస్కర రావు డాక్టర్ వినోద్ కుమార్ గ్రామ పంచాయతీ సెక్రెటరీ మల్లీశ్వరి తో పాటు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు