నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట మండలంలోని దాసరిపల్లి గ్రామంలో సోమవారం జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మతల్లి, కంఠమేశ్వేరుని పండుగ ఉత్సవాలకు గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా ఈ నెల 4న ఆలయంలో దోర్నపాక అలంకరణ జరిగింది.గౌడ పూజారులు సమ్మయ్య,లక్ష్మణ్,గౌడ సంఘం పెద్దల అధ్వర్యంలో సోమవారం రోజు కంఠమేశ్వరుని బోనాలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు వల్లాల శేఖర్ గౌడ్, సారకోల పెద్ద మనిషి వల్లాల నరేష్ గౌడ్ ,ఆలయ కమిటీ అధ్యక్షులు పెరుమాండ్ల అనిల్ గౌడ్,మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్, రాష్ట్ర నాయకులు మద్దెల సాంబయ్య గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పంజాల వెంకట్ గౌడ్, వళ్లాల శ్రీహరి గౌడ్, వళ్ళల అంకుస్ గౌడ్, ఎక్స్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వళ్ళాల కర్ణాకర్ గౌడ్,సట్ల రాజేందర్ గౌడ్,వల్లాల లింగమూర్తి గౌడ్, వెంకట్ గౌడ్,సూద్దాల శేఖర్ గౌడ్, వల్లాల రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కంఠమేశ్వరుని ఉత్సవాలకు హాజరైన మోకుదెబ్బ రమేష్ గౌడ్.
