
కె ఎం సి వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలి
రేపటి నుండి సమ్మెను మరింత ఉధృతం చేస్తాం.
యాద నాయక్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
కాశిబుగ్గ నేటి ధాత్రి.
వరంగల్ కాకతీయ వైద్య కళాశాల మెన్స్ & ఉమెన్స్ హాస్టల్ నందు పనిచేస్తున్న 86 మంది వర్కర్స్ కు 8 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని,ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న “నిరవధిక సమ్మె”ఈ రోజుకు 10వ రోజుకు చేరుకుంది.సమ్మెలో భాగంగా ఈరోజు కాకతీయ వైద్య కళాశాల ప్రధాన ద్వారం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ యునైటెడ్ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాద నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా యాద నాయక్ మాట్లాడుతూ హాస్టల్ వర్కర్స్ కు చెల్లించాల్సిన 8 నెలల వేతనాలు పెండింగ్ లో ఉండటం వలన కుటుంబాలు గడవక,అప్పులు పుట్టక,స్థానిక అధికారులకు అనేకమార్లు వినతిపత్రాలు సమర్పించిన ఫలితం లేకుండా పోయిందనీ అన్నారు. వేతనాలు చెల్లించనందునే గత్యంతరం లేని పరిస్థితుల్లో కార్మికులు నిరవధిక సమ్మెలోకి వెళ్లడం జరిగిందని,ఈ సమ్మెకు పూర్తి బాధ్యత ప్రభుత్వం,అధికారులు వహించవలసి వస్తుందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకొని పెండింగ్ వేతనాలు చెల్లించి ఇతర సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని అన్నారు.లేనియెడల వీరి సమ్మెకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరి మద్దతును కూడగట్టి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి జే సుధాకర్,అల్లం రమేష్,రాణి, రాజకుమారి,ఎండి అతిక్ హనుమకొండ రవి,బాబు,మంద కవిత తదితరులు పాల్గొన్నారు.