మందమర్రి, నేటిధాత్రి:-
ఏరియాలోని కేకే ఓసిపిని ఏరియా జిఎం ఏ మనోహర్ తో కలిసి మంగళవారం సంస్థ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి సందర్శించారు. ముందుగా ఓసిపి కార్యాలయంలో ఓపెన్ కాస్ట్ కు సంబంధించిన మ్యాప్‌లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఓసిపి లోని యంత్రాల పనితీరును మెరుగుపరిచి, నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించేందుకు అందరు కలిసి కృషి చేయాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ ఏజిఎం కేహెచ్ఎన్ గుప్తా, ఓసిపి ప్రాజెక్ట్ అధికారి రమేష్, ఓసిపి డిప్యూటీ సూపరింటెండెంట్, సర్వే అధికారి యు ప్రకాష్, జూనియర్ సర్వే అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.