
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట నూతన ఏసీపీగా కిరణ్ కుమార్ బుదవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు.కాగా ఇక్కడ బాధ్యతలు నిర్వహించిన ఏసిపి తిరుమల్ బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో హన్మకొండ ఏసిపిగా ఉన్న కిరణ్ కుమార్ ను పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం.ఈ నేపథ్యంలో నర్సంపేట ఏసిపిగా విధులు నిర్వహించిన తిరుమల్ నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు.ముందుగా నూతనంగా విధుల్లో చేరిన ఏసిపి కిరణ్ కుమార్ కు ఏసిపి తిరుమల్ పుష్పగుచ్ఛాలు అందించారు.అలాగే నర్సంపేట టౌన్ ,దుగ్గొండి సీఐలు రమణమూర్తి,శ్రీనివాస్ లు,ఎస్సైలు రాజు,పరమేష్,నగేష్,పలువురు ఎస్సైలు,పోలీస్ సిబ్బంది పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికిన శుభాకాంక్షలు తెలిపారు.