ఖిలా వరంగల్ ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్ రాజేష్ సస్పెండ్

*అనుమతి లేని వెంచర్ కు అక్రమ రిజిస్ట్రేషన్ లు చేసిన ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్ రాజేష్*

*ఒక్కో డాక్యుమెంట్ కు 75వేల చొప్పున డీల్, మొత్తం 48 డాక్యుమెంట్లు చేయాలని ఒప్పందం, రెండు రోజుల్లో 26 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసిన ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్ రాజేష్*

*ప్లాన్ ప్రకారం అన్ని రెడీ చేశారు, ఇంకో 22 డాక్యుమెంట్లు చేసే లోపే అక్రమ వ్యవహారం బయటకు పొక్కడంతో సస్పెండ్ చేసిన జిల్లా రిజిస్ట్రార్*

*అనుమతులు లేని అక్రమ వెంచర్ ఎక్కడ?, పూర్తి వివరాలు త్వరలో “మీ నేటిధాత్రి లో”*

*నేటిధాత్రి, వరంగల్*

ఖిలా వరంగల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ రిజిస్ట్రార్ అజ్మీరా కార్తిక్ సెలవుపై వెళ్లగా, ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్ గా బాధ్యతలు చేపట్టిన రాజేష్ ప్లాన్ ప్రకారం ఒక అనుమతి లేని వెంచర్ లో, సుమారు 48 డాక్యుమెంట్లకు డీల్ కుదుర్చుకొని, ఒక్కో డాక్క్యుమెంట్ కు 75వేలకు డీల్ ఒప్పందం చేసుకొని, రెండు రోజుల్లో 26 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసినాడు. అనుమతి లేని వెంచర్, అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం, డబ్బుల డీల్ విషయం బయటకు పొక్కడంతో వెంటనే స్పందించి జిల్లా రిజిస్ట్రార్ రవి, డి.ఐ.జి సుభాషిణి ఆదేశాల మేరకు ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్ గా పని చేసిన రాజేష్ ను సస్పెండ్ చేశారు. అతను చేసిన డాక్యుమెంట్ల పైన విచారణ చేపియ్యనున్నట్లు సమాచారం.

*అనుమతులు లేని ఆ “అక్రమ వెంచర్” పైన పూర్తి వివరాలు త్వరలో*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *