KJVP Student Selected for State Softball Tournament
సాఫ్ట్ బాల్ పోటీలకు కేజీవీపీ విద్యార్థులు ఎంపిక
భూపాలపల్లి నేటిధాత్రి
ఈనెల 2న హన్మకొండ జిల్లా ఎస్ డిఎల్ సి క్రీడా ప్రాంగణంలో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ హన్మకొండ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి సీనియర్ సాఫ్ట్ బాల్ సెలెక్షన్ పోటీలలో, జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల కేజీవీపీ ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఎన్. శరణ్య అద్భుత ప్రతిభ ప్రదర్శించి, హన్మకొండ జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించింది.
రాష్ట్ర స్థాయి సీనియర్ సాఫ్ట్ బాల్ పోటీలు జగిత్యాల జిల్లాలో నవంబర్ 7 నుంచి 9 వరకు జరగనున్నాయి.
ఈ విజయంపై కేజీవీపీ స్పెషల్ ఆఫీసర్ నాగపురి స్వప్న వ్యాయామ ఉపాధ్యాయురాలు అనిత ఉపాధ్యాయ బృందం విద్యార్థినీ తల్లిదండ్రులు శరణ్యను హృదయపూర్వకంగా అభినందించారు.
