నర్సంపేట,నేటిధాత్రి :
ఈ నెల 13,14 తేదీలలో గుజరాత్ రాష్ట్రంలోని పలాజ్ జిల్లా
గాంధీనగర్ ఐఐటీ కళాశాలలో జరిగే జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైనట్లు దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాల ప్రత్యేక అధికారిని మంజుల తెలిపారు.ఈ సందర్భంగా ప్రత్యేక అధికారిని మంజుల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలు ఈ నెల 3, 4 వ
తేదీలలో యాదాద్రి జిల్లాలో జరుగగా ఆ పోటీలలో తమ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని వి. కీర్తన తన ఉత్తమ ప్రతిభని కనబరిచి జాతీయ స్థాయికి ఎంపిక కావడం
జరిగిందన్నారు.కాగా గుజరాత్ రాష్ట్రంలో 13,14 తేదీలలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా వరంగల్ జిల్లా జిసిడిఓ ఫ్లోరెన్స్,పాఠశాల ప్రత్యేక అధికారిణి మంజుల,పిఈటీ లావణ్య,అధ్యాపక బృందం రమ, సుభాషిణి, పుష్పలాల, సరస్కృతి, స్రవంతి, సంధ్య,
స్రవంతి, రాధిక, కవిత,రమ్మశ్రీలు విద్యార్థిని కీర్తనను అభినందించారు.