కేజీబీవీ నూతన తరగతి గదులను వెంటనే ప్రారంభించాలి.

ఏబీవీపీ ప్రాంత కార్య సమితి సభ్యులు రాజ్ కుమార్ డిమాండ్.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం లోని కేజీబీవి నూతనంగా నిర్మించిన తరగతి గదులను వెంటనే ప్రారంభించాలి అని ఏబీవీపీ ప్రాంత కార్య సమితి సభ్యులు
వేల్పుల రాజు కుమార్ డిమాండ్ చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది నిర్మించిన తరగతి గదులను విద్య సంవత్సరం లోపు ప్రారంభించిలసివున్న అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అని ,
సరి పడా తరగతి గదుల లేక విద్యార్థులు ఇబ్బందిపడుతున్న రు . కోట్లాది రూపాయల నిధులు తో నిర్మించిన తరగతి గదుల్లో ఈ విద్య సంవత్సరం బోధన ప్రారంభించాలని డిమాండ్ చేశారు . ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే
జిల్లా అధికారులు స్పందించి వెంటనే నూతన గదులను అనుదుబాటులో కి తేవాలని అన్నారు ,దీంతో పాటు పాఠశాల లో నెలకొన్న ఇతర సమస్యలని పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేదంటే ఏబీవీపీ అధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *