పిడిఎస్ యు ఇల్లందు డివిజన్ కార్యదర్శి బానోత్ నరేందర్
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
గుండాల మండల కేంద్రంలో కస్తూర్భా గాంధీ విద్యాలయంలో విద్యార్థుల తల్లిదండ్రులను కలుపుకొని ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత (పిడిఎస్యు) ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా పిడిఎస్ యు ఇల్లందు డివిజన్ కార్యదర్శి బానోత్ నరేందర్ మాట్లాడుతూ గత పది రోజుల నుంచి తమ సమస్యను పరిష్కరించి తమను రెగ్యులరేషన్ చేయాలని చెప్పి సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మెలో ఉండడంతో కస్తూర్బా గాంధీ బాలికల,కళాశాల పాఠశాలలో గత పది రోజులుగా విద్యార్థులకు క్లాసులు జరగకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖకు సంబంధించిన అధికారులు స్పందించి విద్యార్థులకు విద్యను కొనసాగిస్తమని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా వచ్చింది. విద్యార్థులకు క్లాసులు జరగకపోవడంతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. తక్షణమే సర్వశిక్షన్ అభియాన్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించి విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో పిడిఏస్ యూ నాయకులు హేమంత్ ,మహేష్,భవాని,అఖిల,సింధు, నవ్య,బిందు,తదితరులు పాల్గొన్నారు.