
బిడ్డ పుట్టిన మూడు రోజులకే కీలక ప్రకటన
బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ (Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra) ఇటీవల తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఈ నెల 15న వారికి పండంటి ఆడబిడ్డ పుట్టినట్లు తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా శుభాకాంక్షలు చెబుతున్నారు. మరికొందరు మాత్రం వారి పాప ఫొటోలను షేర్ చేయాలని నిత్యం పలు మెసేజ్లు షేర్ చేస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, కియారా అద్వానీ, సిద్ధార్థ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ కీలక ప్రకటనను విడుదల చేసి అభిమానులకు విజ్ఞప్తి చేశారు. “మీ అందరి ప్రేమ, శుభాకాంక్షలతో మా హృదయం ఉప్పొంగిపోతోంది.
తల్లిదండ్రులుగా మేం మొదటి అడుగులు వేస్తున్నాం. ఈ సమయాన్ని పూర్తిగా ఆస్వాదించాలని కోరుకుంటున్నాం. ఈ ప్రత్యేక సమయంలో గోప్యతను పాటించాలనుకుంటున్నాం. అందుకే ఫొటోలు పంచుకోవడం లేదు. మీరు కూడా దయచేసి మా పాపను ఫొటోలు తీయొద్దు. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నాం. మీ అందరి సపోర్టు ధన్యవాదాలు తెలుపుతున్నాము” అని కీలక నోట్ విడుదల చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు వారికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. అందరు సెలబ్రిటీల లాగానే వీరు కూడా తమ బిడ్డను చూపించరని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.