Devotees Throng Ketaki Temple on Karthika Amavasya
భక్తులతో కిటకిటలాడిన కేతకి ఆలయం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: అష్ట తీర్థాల సంగమం, దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. గురువారం కార్తీక మాసం చివరి అమావాస్య, సందర్భంగా భక్తులు స్వామివారి దర్శనానికి తెల్లవారు జాము నుంచి చేరుకున్నారు. స్వామి వారి ధర్మ దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. కార్తీక మాసం చివరి అమావాస్య సందర్భంగా పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారికి సుప్రభాత సేవ, మేల్కొల్పు సేవ, మహా రుద్రాభిషేకం, మహా మంగళ హారతి నిర్వహించిన అనంతరం రాత్రి 4 :30 నుండి భక్తులకు ప్రవేశాన్ని దర్శనానికి అనుమతించారు.

ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయింది. ఓం నమశ్శివాయ పంచాక్షరి నామం తో మార్మోగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ఇతర రాష్ట్రాల భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ
ఈవో మహా రుద్రయ్య చైర్మన్ శేఖర్ పటేల్ ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు, దేవస్థానానికి వచ్చిన భక్తులకు అన్నదాన సౌకర్యంతో పాటు త్రాగే నీరు సౌకర్యాలు చేశారు,
